ENGLISH

క‌త్తి మ‌హేష్ కి కీల‌క‌మైన ఆప‌రేష‌న్‌

28 June 2021-10:20 AM

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ న‌టుడు, సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న క‌రంగానే ఉన్నా, భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈరోజు (సోమ‌వారం) ఆయ‌న‌కు ఓ కీల‌క‌మైన ఆప‌రేష‌న్ చేయ‌బోతున్నారు. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైతే.. క‌త్తి మ‌హేష్ దాదాపుగా గ‌ట్టెక్కేసిన‌ట్టే. ప్ర‌మాదంలో ఆయ‌న మొహంపై తీవ్రమైన గాయాల‌య్యాయి. ద‌వ‌డ ఎముక చిట్లింది. క‌న్ను దెబ్బ‌తింది. నుదురు భాగంపైనా గ‌ట్టి దెబ్బే త‌గిలింది.

 

మొహానికి ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. దెబ్బ‌తిన్న కంటిపై ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఈ ఆప‌రేష‌న్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైన త‌ర‌వాతే.. కంటికి సంబంధించిన చికిత్స మొద‌లు పెడ‌తారు.

 

బ్రెయిన్ ఇంజ్యూరీ వ‌ల్ల‌.. ఆ భాగానికీ ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మా? లేదా? అనే విష‌యంలో ఇంకా వైద్యులు ఓ నిర్దార‌ణ‌కు రాలేదు. ఈరోజుమ‌ధ్యాహ్నం క‌త్తి మ‌హేష్ కి ఆప‌రేష‌న్ చేస్తార‌ని, రేప‌టి లోగా.. క‌త్తి మ‌హేష్ ప‌రిస్థితిపై ఓ అంచ‌నాకు రావొచ్చని వైద్యులు తెలిపారు.

ALSO READ: జులై 1 నుండి ర‌వితేజ‌ కొత్త సినిమా ప్రారంభం..!