ENGLISH

కపిల్‌ భార్యగా కత్రినా కైఫ్‌

03 October 2017-18:24 PM

ఇప్పుడంతా బయోపిక్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. క్రికెట్‌కి సంబంధించి ఒకే ఒక్క ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌. ఆయన తర్వాత ఆ స్థాయిలో ఆల్‌రౌండర్‌ ఎవ్వరూ లేరు ఇంతవరకూ. ఆయన కెప్టెన్‌గా ఉన్నప్పుడే ఇండియా వరల్డ్‌ కప్‌ సాధించింది. సో క్రికెట్‌కి సంబంధించినంతవరకూ కపిల్‌ దేవ్‌ జీవిత గాధ చాలా స్పెషల్‌. అందుకే కపిల్‌ దేవ్‌ జీవిత గాధ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు సర్వం సిద్ధమైంది కూడా. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. తాజాగా కపిల్‌ భార్య పాత్రకి ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ని ఎంచుకుందట చిత్ర యూనిట్‌. 1983 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి ఈ సినిమాకి '83' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కబీర్‌ఖాన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫాంటమ్‌ ఫిలింస్‌ సంయుక్తంగా, విష్ణు ఇందుకూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కపిల్‌ లైఫ్‌లో ఆయన భార్య రోమిదేవి పాత్రకు ప్రాధాన్య ఉంది. అందుకే ఆ క్యారెక్టర్‌ కోసం కత్రినా కైఫ్‌ అయితే బావుంటుందని చిత్ర యూనిట్‌ యోచిస్తోంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారు. మరో పక్క బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా బయోపిక్స్‌ తెరకెక్కేందుకు రెడీగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా క్రీడాకారుల జీవిత గాధలే ఎక్కువ. ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి రంగం సిద్దమైంది. ఇటీవల దేశానికి పతకాలు సాధించి పెడుతున్న పి.వి.సింధు బయోపిక్‌నీ తెరకెక్కించే యోచనలో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఉన్నట్లు తెలుస్తోంది . తసైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.

ALSO READ: సక్సెస్ మీట్ కి ‘NO’ చెప్పిన మహేష్?!