ENGLISH

ప్ర‌భాస్ సినిమా కీర‌వాణి చేతికి!

15 September 2020-09:05 AM

ప్ర‌భాస్ చేతిలో ఉన్న మ‌రో పాన్ ఇండియా సినిమా `ఆది పురుష్‌`. ఈ సినిమాకి సంబంధించిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక జ‌రుగుతోంది. ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్ పేరు అధికారికంగా ప్ర‌క‌టించేసింది చిత్ర‌బృందం. క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టుల పేర్లు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తారు. అయితే సంగీత ద‌ర్శ‌కుడిగా రెహ‌మాన్ ని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రెహ‌మాన్ తో చిత్ర‌బృందం సంప్ర‌దింపులు కూడా జ‌రిపింది. అయితే ఇప్పుడు రెహ‌మాన్ చేతుల నుంచి.. కీర‌వాణి చేతికి ఈసినిమా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

 

రెహ‌మాన్ కంటే కీర‌వాణినే ఈ క‌థ‌కు న్యాయం చేస్తార‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. పైగా బాహుబ‌లితో కీర‌వాణి బాలీవుడ్ నీ ఓ ఊపు ఊపేశాడు. దాంతో.. కీర‌వాణి అయితే ఈ ప్రాజెక్టుకు మ‌రింత మైలేజీ వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు. 2021 జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈలోగా... అన్ని వివ‌రాలూ ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు రానున్నాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ - క్రిష్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు కీర‌వాణి. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కీ.. ఆయ‌నే సంగీత ద‌ర్శ‌కుడు.

ALSO READ: రికార్డుల వేట మొద‌లెట్టిన మ‌హేష్‌బాబు