గ్లామర్‌కి దూరంగా ఉంటూనే, తన అద్భుతమైన నటనతో ప్రముఖుల ప్రశంసలు, అలాగే వరుస అవకాశాలు దక్కించుకంఉటోన్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. యంగ్ హీరోస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి, పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించే చాన్స్ కొట్టేసింది. 'నేను శైలజ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 'నేను లోకల్'తోనూ హిట్ అందుకుంది. తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఎక్స్‌పోజింగ్‌కి అస్సలేమాత్రం ఒప్పుకోదు. కవర్ పేజ్ మీద ఫొటో అనగానే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తారు హీరోయిన్లు. కానీ కీర్తి సురేష్ వెరీ వెరీ స్పెషల్. రిట్జ్ మ్యాగజైన్ కోసం ఇలా దర్శనమిచ్చింది. గ్లామర్‌కి ఎక్స్‌పోజింగే ముఖ్యం కాదు, అని నిరూపించింది ఈ పోజుతో కీర్తి. అందుకే కీర్తి ఈజ్ వెరీ వెరీ స్పెషల్.
ALSO READ: Qlik Here For Keerthy suresh Latest Photos