ENGLISH

ఎన్టీఆర్‌తో 'రొమాంటిక్‌' హీరోయిన్‌.

22 November 2020-11:05 AM

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌. రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్సుంద‌ని స‌మాచారం. ఓ పాత్ర కీర్తి సురేష్‌కి ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకి హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో... పూజా స్థానంలో కీర్తి వ‌చ్చి చేరింది. రెండో హీరోయిన్‌గా కేతిక శ‌ర్మ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

 

ఇటీవ‌లే కేతిక‌పై లుక్ టెస్ట్ కూడా నిర్వ‌హించార‌ట‌. పూరి త‌న‌యుడు ఆకాష్ న‌టిస్తున్న `రొమాంటిక్‌` తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది కేతిక‌. తొలి సినిమా బ‌య‌ట‌కు రాకుండానే... ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటే మామూలు విష‌యం కాదు. త్రివిక్ర‌మ్ సినిమాలో చిన్న పాత్ర‌నైనా, పెద్ద స్టార్స్‌తో భ‌ర్తీ చేస్తుంటారు. అలానే కేతిక‌కి సైతం ఛాన్స్ వ‌చ్చిందా? లేదంటే హీరోయిన్ స్థాయి ఉన్న పాత్రేనా? అన్న‌ది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: మ‌హేష్‌తో అనుష్క.. నిజ‌మేనా?