ENGLISH

ఇలాగైతే ఖిలాడికి క‌ష్ట‌మే!

24 January 2022-10:12 AM

సంక్రాంతి సీజ‌న్ అయిపోయింది. బంగార్రాజు ఈ సంక్రాంతి హిట్ గా నిలిచింది. మిగిలిన ఏ సినిమా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఫిబ్ర‌వ‌రిలోనూ పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 11న ఖిలాడీ వ‌స్తోంది. భీమ్లా నాయ‌క్ 25న అంటున్నారు గానీ క్లారిటీ లేదు. అయితే ఖిలాడీ మాత్రం 11న రావ‌డం ఖాయం.

 

అయితే.. ఖిలాడికి కొన్ని క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదురుకావొచ్చు. తెలుగు రాష్ట్రాల‌లో ఇప్ప‌టికీ క‌రోనా కేసులు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో పాటు నైట్ కర్‌ఫ్యూ అమ‌లులో ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఖిలాడిని రిలీజ్ చేద్దామ‌నే నిర్మాత‌లు డిసైడ్ అయ్యారు. కేసులు పెరుగుతూ వెళ్తే.. జ‌నాల‌లో భ‌యం ఏర్ప‌డుతుంది. అలాంట‌ప్పుడు థియేట‌ర్ల‌కు రావ‌డానికి ఆలోచిస్తారు. సంక్రాంతి సీజ‌న్ కాబ‌ట్టి బంగార్రాజుకి వ‌సూళ్లు వ‌చ్చాయి గానీ, మిగిలిన రోజుల్లో విడుద‌లైతే, ఆ సినిమాకి ఇన్ని క‌ల‌క్ష‌న్లు వ‌చ్చేవి కావు. పైగా సంక్రాంతి స‌మ‌యంలో 50 శాతం నిబంధ‌న, నైట్ క‌ర్‌ఫ్యూలు లేవు. ఇవ‌న్నీ ఖిలాడి నిర్మాత‌ని ఇబ్బంది పెట్టే విష‌యాలే. ఫిబ్ర‌వ‌రి తొలి వారం వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటే... ఖిలాడి వాయిదా ప‌డొచ్చు. లేదంటే మాత్రం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుంది.

ALSO READ: రౌడీబోయ్స్ తో న‌ష్ట‌మెంత‌?