ENGLISH

పాపం... 20 వేల టికెట్లు ఫ్రీగా పంచాడు!

25 June 2022-10:03 AM

సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఒకొక్క‌రూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొంత‌మంది కాంట్ర‌వ‌ర్సీలు సృష్టించుకొని సినిమాని ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. ఇంకొంత‌మంది ఫీల్ గుడ్ ప్ర‌చార పద్ధ‌తుల‌తో ముందుకు వెళ్తున్నారు. కిరణ్ అబ్బ‌వ‌ర‌పు అదే చేశాడు.

 

త‌న కొత్త సినిమా `స‌మ్మ‌త‌మే` ప్ర‌మోష‌న్ల‌కు కొత్త ర‌త‌హా మార్గం అనుస‌రించాడు. కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు హీరోగా న‌టించిన `స‌మ్మ‌త‌మే` శుక్ర‌వారం విడుద‌లైంది. టాక్ ప‌రంగా, క‌ల‌క్ష‌న్ల ప‌రంగా `ఓకే` అనిపించుకొంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా... త‌న అభిమానుల‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చాడు కిర‌ణ్‌. ఎవ‌రైనా సినిమా టికెట్లు కొనుక్కోలేని ప‌రిస్థితులో ఉంటే, త‌న‌కు చెప్పాల‌ని, వాళ్ల టికెట్ తాను కొంటాన‌ని చెప్పాడు. దాంతో.. కిర‌ణ్‌కు బోలెడ‌న్ని సందేశాలొచ్చేశాయి. `మాకు ఫ్రీ టికెట్ కావాలి..` అంటే `మాకు కావాలి` అంటూ వ‌రుస‌గా రిక్వెస్టులు పెట్టేశారు. అలా.. దాదాపు 20 వేల టికెట్ల‌కు రిక్వెస్టులు వ‌చ్చాయ‌ట‌. గురువారం రాత్రి మొత్తం... కూర్చుని బుక్ మై షోల‌లో టికెట్లు బుక్ చేశాడు కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు. ఫ్రీ టికెట్లు పొందిన వాళ్లంతా శుక్ర‌వారం సినిమా చూసేశారు. అయితే ఒకొక్క‌రూ.. 10, 20 టికెట్లు అడ‌గ‌డం, వాళ్లంద‌రికీ టికెట్లు ఇవ్వ‌లేక‌.. కిర‌ణ్ త‌ల ప‌ట్టుకోవ‌డం.. కొస‌మెరుపు. ``ఎవ‌రికైనా ఫ్రీ టికెట్ కావాలా అని అడిగాను. టికెట్ కొనుక్కోలేని వాళ్ల‌కు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌. కానీ... అనూహ్యంగా రిక్వెస్టులు వ‌చ్చాయి. అడిగిన వాళ్లంద‌రికీ టికెట్లు ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నించా. వాళ్లంద‌రికీ టికెట్ ఇవ్వాలంటే నా ఆస్తులు అమ్ముకోవాల్సివ‌స్తుంది`` అని స‌ర‌దాగా... మ‌రో వీడియో పోస్ట్ చేశాడు కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు. మొత్తానికి ఈ ఫ్రీ టికెట్ ఆఫ‌ర్ ప్ర‌చారానికి బాగానే ఉప‌యోగ‌ప‌డింది.

ALSO READ: నందమూరి బాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్