ENGLISH

సోనూసూద్ కీ `క్రాక్‌` ఎక్కేసిందా?

26 January 2021-10:38 AM

విల‌న్ నుంచి రియ‌ల్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న న‌టుడు సోనూసూద్‌. అందుకే ఇప్పుడు వెండి తెర‌పైనా త‌న‌ని హీరోగా చూపించ‌డానికి ద‌ర్శ‌కులు రెడీ అయిపోతున్నారు. ఇప్ప‌టికే ఒక‌ట్రెండు క‌థ‌ల‌కు సోనూ సంత‌కాలు చేసిన‌ట్టు టాక్‌. రెండూ తెలుగు సినిమాలే. ఇప్పుడు బాలీవుడ్ ఆఫ‌ర్ కూడా వ‌చ్చేసింద‌ట‌. ఓ బాలీవుడ్ సినిమాలో సోనూ... హీరోగా న‌టిస్తున్నాడ‌ని టాక్‌. విశేషం ఏమిటంటే.. అది `క్రాక్‌`కి రీమేక్ అని తెలుస్తోంది.

 

ఈ సంక్రాంతికి విడుద‌లైన క్రాక్‌.. సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ 40 కోట్లు సాధించి, 50 కోట్ల క్ల‌బ్ లో చేర‌డానికి దూసుకుపోతోంది. ఈ సినిమాకి బాలీవుడ్ రీమేక్ ఆఫ‌ర్లు.. పోటెత్తుతున్నాయి. ఒక‌ట్రెండు నిర్మాణ సంస్థ‌లు క్రాక్ హ‌క్కుల కోసం పోటీ ప‌డుతున్నాయి. సోనూసూద్ హీరోగా ఈ సినిమాని హిందీలో తెర‌కెక్కించాల‌ని ఓ నిర్మాత విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్. గోపీచంద్ మ‌లినేనినే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కూడా అడిగార్ట‌. కానీ గోపీచంద్ మ‌లినేని ఇంకా ఏం తేల్చుకోలేద‌ని టాక్‌.

ALSO READ: ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ప‌ద్మ‌విభూష‌ణ్‌