ENGLISH

క్రిష్ చెప్పేది ప‌వ‌న్ గురించేనా..?

20 November 2020-18:00 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ కార‌ణంగా చిత్రీక‌ణ ఆగిపోయింది. ఆ త‌ర‌వాత క్రిష్ మ‌రో ప్రాజెక్టు ప‌నిలో బిజీ అయిపోయాడు. ప‌వ‌న్ కూడా `వ‌కీల్ సాబ్‌` సెట్స్లో అడుగుపెట్టాడు. అయితే ఇప్పుడు `ఈ శ‌నివారం` ఓ క‌బురు చెబుతా.. అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. అది ప‌వ‌న్ సినిమా గురించే అయ్యుంటుంద‌ని ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఆశ‌ల ప‌ల్ల‌కిలో తేలిపోతున్నారు.

 

ఈ సినిమా షెడ్యూల్ డిసెంబ‌రులో మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొత్త షెడ్యూల్ డేట్ ఈసారి చెప్పే అవ‌కాశం ఉంది. లేదంటే.. ఈ సినిమా పేరేంటో ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. `విరూపాక్ష` అనే టైటిల్ పరిశీల‌న‌లో వుంది. అదైనా రివీల్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. మరోవైపు వైష్ణ‌వ్ తేజ్ తో క్రిష్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌. `కొండ పొలెం` అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. శ‌నివారం ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ అయినా రావొచ్చు. మ‌రి క్రిష్ ఎలాంటి స‌ర్‌ప్రైజ్ చెబుతాడో చూడాలి.

ALSO READ: తాప్పీ టాలీవుడ్‌లో ఎవర్ని టార్గెట్‌ చేసిందో!