సూపర్ స్టార్ కృష్ణతో నిన్నటితరం అందాల భామ ఇంద్రజ 'అమ్మదొంగా' సినిమాలో నటించింది. చాలాకాలం తర్వాత ఇంద్రజ, కృష్ణ ఓ సినీ వేడుకలో కన్పించారు. ఒకప్పటి 'అమ్మదొంగా' సినిమా ముచ్చట్లను ఇద్దరూ పంచుకున్నారు. అప్పటికే కృష్ణ సూపర్ స్టార్, పైగా సీనియర్ హీరో. 'అమ్మదొంగా' సినిమాలో ఇంద్రజ, సూపర్ స్టార్‌తో కలిసి ఆడిపాడింది. ఇద్దరి కెమిస్ట్రీ ఆ సినిమాలో బాగా పండింది కూడా. సౌందర్య ఆ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. విజయనిర్మల తనయుడు నరేష్ (సీనియర్ నటుడు), తన కుమారుడు నవీన్ విజయకృష్ణతో కలిసి 'విఠలాచార్య' సినిమా చేస్తున్నాడు. నవీన్‌కృష్ణ ఇటీవలే 'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. నరేష్, నవీన్ విజయకృష్ణ నటిస్తున్న 'విఠలాచార్య' సినిమా ప్రారంభోత్సవంలోనే ఇంద్రజ, కృష్ణ కలుసుకున్నారు. అప్పటి అనుభూతుల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పటి గుర్తుగా సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ చూసి ఫ్యాన్స్ అంతా ఓహో సెల్ఫీ అదిరిందిగా! అనుకోకుండా ఉండలేకపోతున్నారు. మరో పక్క ఇటీవలే ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలనాటి హీరోయిన్‌గా పాపులర్ అయిన ఇంద్రజ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని 'దిక్కులు చూడకు రామయ్యా' సినిమాలో అజయ్‌కి భార్యగా, నాగశౌర్యకి తల్లిగా నటించి మెప్పించింది. 'శతమానం భవతి' సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌కి తల్లిగానూ నటించింది.
ALSO READ: బాలీవుడ్‌కి ప్రబాస్ అప్పుడే కాదు