ENGLISH

Panworld: పాన్ వరల్డ్ సినిమాకి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్

17 November 2022-09:03 AM

తెలుగు కౌ బాయ్‌ సూపర్ స్టార్ కృష్ణ. మన జేమ్స్‌బాండ్‌ కూడా ఆయనే. ఆయన చేసే ప్రతి ప్రయోగంలో రిస్క్ వుండేది. రిస్క్ చేస్తేనే విజయం దక్కుతుందనేది ఆయన ఫిలాసఫీ. హీరోగానే కాదు నిర్మాతగా దర్శకుడిగా ఆయన చాలా రిస్కులు చేశారు. తెలుగులో భారీ బడ్జెట్‌ సినిమాలు మొదలుపెట్టిన ముందు వరుసలో వుంటారు కృష్ణ.

 

తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ‘సింహాసనం’ని తెరకెక్కించారు.కో ట్లలో ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కృష్ణే స్వయంగా దీన్ని నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. తెలుగులో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాని ‘సింహాసన్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు.

 

పాన్ ఇండియా ట్రెండ్ ఇప్పటి ట్రెండ్. అయితే ఆ మాటే లేని రోజుల్లో పాన్ వరల్డ్ సినిమాని తీసిన ఘనత కృష్ణకి దక్కుతుంది. ‘మోసగాళ్లకు మోసగాడు’ కృష్ణ కెరీర్ లో ఓ మైలు రాయి. ఇది తమిళంతో పాటు హిందీలో ‘ఖజానా’ పేరుతో, ఇంగ్లిష్‌లో ‘ది ట్రెజర్‌‌’ పేరుతో విడుదలై విజయాన్ని అందుకుంది. ఇంగ్లిష్ వెర్షన్ చాలా దేశాల్లో విడుదల చేసి పాన్ వరల్డ్ సినిమాకి ఆనాడే శ్రీకారం చుట్టారు కృష్ణ.

ALSO READ: అల్లూరి సీతారామరాజు.. 'వద్దు బ్రదర్'