ENGLISH

పూరి జగన్నాధ్ పేరు చెప్పి మోసం చేశారు?!

15 June 2017-18:49 PM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. అందుకే ఈ ఇండస్ట్రీ పై మోజుతో చాలా మంది తమ ఇంట్లోవాళ్ళకి ఇష్టం లేకపోయినా ఇందులోకి అడుగుపెడుతుంటారు.

కాని ఇలా వచ్చిన వారిని నమ్మించి మోసం చేసే వారి సంఖ్య కూడా ఎక్కువనే చెప్పాలి. ఇలా ఎన్నో కలలతో హీరోయిన్ అవుదామని వచ్చి కృష్ణవేణి అనే మహిళా మోసపోయింది. తెలియవస్తున్న వివరాల ప్రకారం- ఖమ్మం జిల్లా నుండి వచ్చిన కృష్ణవేణికి ఓ మధ్యవర్తి ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

శ్రీనివాస్ తనని తాను డైరెక్టర్ పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నానని, రాబోయే పూరి చిత్రంలో ఎలాగైనా హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కృష్ణవేణిని లోబర్చుకున్నాడు.

అయితే ఇలా జరిగిన కొన్నిరోజులకే కృష్ణవేణి ఫోన్ చేస్తున్నా శ్రీనివాస్ స్పందించకపోవడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ALSO READ: హీరోయిన్-డైరెక్టర్ ల షాకింగ్ ఎఫైర్!!