ENGLISH

ప‌వ‌న్ సినిమాలో కృతి శెట్టి

19 March 2022-11:30 AM

రీమేక్ సినిమాల‌పై ఎక్కువ ఆస‌క్తి చూపిస్తుంటాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇటీవ‌ల విడుద‌లైన భీమ్లా నాయ‌క్‌, అంత‌కు ముందు వ‌చ్చిన.. వ‌కీల్ సాబ్ రెండూ రీమేకులే. ఇప్పుడు మ‌రో రీమేక్ కి ప‌చ్చ జెండా ఊపాడు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం వినోద‌య సీత‌మ్. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌ముద్ర‌ఖ‌నినే రీమేక్ నీ తెర‌కెక్కించే బాధ్య‌త తీసుకున్నారు. ఇందులో ప‌వ‌న్ తోపాటుగా సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా క‌నిపించ‌బోతున్నాడు. ఓ ర‌కంగా ఇది మెగా మ‌ల్టీస్టార‌ర్‌.

 

ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా కృతి శెట్టిని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న కృతి క‌థ‌నాయిక‌గా క‌నిపించ‌బోతోంది. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకొంటోంది. ప‌వ‌న్ త‌న రెమ్యున‌రేష‌న్ బ‌దులుగా, సినిమాలో వాటా తీసుకున్నాడ‌ని టాక్. సాధార‌ణంగా ప‌వ‌న్ పారితోషికం రూ.50 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. దాన్నే త‌న పెట్టుబ‌డిగా పెట్టాడు ప‌వ‌న్‌.

ALSO READ: Krithi Shetty Latest Photoshoot