ENGLISH

సూర్య‌తో ఛాన్స్‌.. త‌మిళంలోనూ పాగా వేస్తుందా?

15 March 2022-15:32 PM

ఉప్పెన‌తో దూసుకొచ్చిన యువ కెర‌టం.. కృతి శెట్టి. ఇప్పుడు టాలీవుడ్ లో త‌ను అత్యంత బిజీ క‌థానాయిక‌గా మారిపోయింది. కృతి కాల్షీట్లు ఇప్ప‌ట్లో దొరికే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు త‌మిళం నుంచి కూడా ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తాజాగా సూర్య సినిమాలో హీరోయిన్ గా లాక్ అయిన‌ట్టు స‌మాచారం.

 

సూర్య క‌థానాయ‌కుడిగా బాలా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈచిత్రానికి సూర్య నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా కృతిశెట్టిని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. బాలా చిత్రాల్లో క‌థానాయిక పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కృతి కూడా ఈ ఆఫ‌ర్ ని కాద‌న‌లేక‌పోయింది. ఈ రూపంలో త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టే అవ‌కాశం వ‌చ్చింది కృతికి. అక్క‌డో హిట్ ప‌డితే.. తమిళంలోనూ కృతిశెట్టి బిజీ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం. తెలుగులో కృతి పారితోషికం దాదాపుగా కోటి రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. అంత‌కు మించే... సూర్య సినిమాకి పారితోషికం అందుకోబోతోంద‌ని టాక్.

ALSO READ: బాలీవుడ్ లో బ‌న్నీ భారీ సినిమా?!