ENGLISH

Kriti Sanon: ప్రభాస్ తో ప్రేమ పై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్

30 November 2022-15:00 PM

గత రెండు రోజులుగా ప్రభాస్, కృతి సనన్ ల ప్రేమ వార్తలే. ‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ ఓ షోలో పాల్గొన్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ హీరో కృతితో ప్రేమలో ఉన్నారంటూ ఆ షోలో వరుణ్‌ కామెంట్స్ చేశాడు. ‘‘కృతిసనన్‌ పేరు మరొకరి మనసులో వుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అంటూ వరుణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ప్రభాస్ , కృతి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టించేశారు.

 

అయితే ఎట్టకేలకు కృతి తాను ఎవరి ప్రేమలో లేనని స్పష్టం చేసింది."ఇది ప్రేమ కాదు, అలా అని ప్రచారం కోసం చేసిందీ కాదు. వరుణ్ ఓ రియాలిటీ షోలో కాస్త వైల్డ్ గా ప్రవర్తించాడు. అతడి మాటలు గాసిప్స్ కి దారితీశాయి. కొన్ని వెబ్‌సైట్లు నా వివాహ తేదీనీ ప్రకటించడానికి ముందే వీటికి నేను ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా. వాటిల్లో ఎలాంటి నిజం లేదు’’ అని ఆమె క్లారిటీ ఇచ్చింది.

ALSO READ: ఈ విషయంలో వెనకబడ్డ 'వారసుడు'