ENGLISH

తెలుగుపరిశ్రమ కోసం నేనుంట: కేటీఆర్

07 June 2017-11:19 AM

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి అయిన కేటీఆర్ నిన్న జరిగిన ఒక ఆడియో వేడుకలో ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక మాట ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే, నిర్మాత సురేష్ బాబు నిన్న జరిగిన కాదలి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో జీఎస్టీ బిల్ ప్రభావం రీజినల్ చలనచిత్ర పరిశ్రమల పై పడనున్న ప్రభావం పై కేటీఆర్ ని చొరవ తీసుకోమని కోరారు.

దానికి వెంటనే, కేటీఆర్ స్పందిస్తూ- తాను యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీని అపాయింట్మెంట్ తీసుకుంటానని, అలాగే ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాకుండా మిగిలిన దక్షిణ భారత పరిశ్రమలని ఒక డెలిగేషన్ లాగా ఢిల్లీకి తీసుకువెళ్తానని హామీ ఇచ్చాడు.

 

అయితే ఇప్పటికే ఒకసారి ఇదే విషయమై తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఢిల్లీకి తీసుకువెళ్ళి మాట్లాడించారట.
 

 

ALSO READ: అల్లు వారబ్బాయి తో పెళ్లిచూపుల హీరో..