ENGLISH

లేడీస్ టైల‌ర్ హీరోయిన్ మ‌ళ్లీ..!

02 March 2022-12:00 PM

నిరీక్షణ, భారత్ బంద్, లేడీస్ టైలర్ లాంటి చిత్రాలతో ఆక‌ట్టుకున్న క‌థానాయిక అర్చ‌న‌. `వీడు` చిత్రానికి జాతీయ అవార్డు కూడా వ‌చ్చింది. లేడీస్ టైల‌ర్ లో సుజాత టీచ‌ర్‌గా... త‌న న‌టన గుర్తుండిపోతుంది. నిరీక్ష‌ణ‌లోనూ ఆమెకు మంచి మార్కులు ప‌డ్డాయి.

 

చాలా కాలం త‌ర‌వాత‌.. అర్చ‌న మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌నుంది. ఆకాష్ పూరి సినిమాతో. ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయిక. దళం, జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో అర్చ‌న ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.ఆమె ఓ తెలుగు సినిమాలో క‌నిపించి పాతికేళ్ల‌య్యింది. ఈమ‌ధ్య‌లో కొన్ని అవ‌కాశాలు వ‌చ్చినా, అర్చ‌న నో చెప్పింద‌ట‌.కేవ‌లం క‌థ, త‌న పాత్ర న‌చ్చి ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. పాత బ‌స్తీ నేప‌థ్యంలో సాగే క‌థ చోర్ బ‌జార్‌. చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

ALSO READ: భీమ్లా నాయక్ పై కొత్త వివాదం