ENGLISH

హాట్‌ అండ్‌ స్పైసీ లావణ్యం

05 October 2017-17:40 PM

ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి సిట్యువేషన్‌కి తగ్గట్టుగా తన గ్లామర్‌ని ప్రదర్శిస్తూ ఉంటుంది. చక్కనమ్మ చీర కట్టినా అందమే. చుడీ దార్‌ వేసినా అందమే. అలాగనీ అల్ట్రా మోడ్రన్‌ వేర్‌ అయినా ఇంకా అందమే. అందుకే లావణ్యకి ఏ కాస్ట్యూమ్‌ అయినా ఇట్టే సూటయిపోతుంది. ఆమె ఫిజిక్‌లో ఉన్న లాజిక్‌ అలాంటిది. సింపుల్‌గా కనిపించినా, హాట్‌ హాట్‌ అప్పీల్‌ మోములోనే చూపించేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈ గోల్డెన్‌ నెట్టెడ్‌ టాప్‌లో కనీ కనిపించని ఆమె అందాలు అంతగా కైపెక్కించేస్తున్నాయి. ఇటీవలే 'యుద్ధం శరణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాతో త్వరలోనే మళ్లీ ఆడియన్స్‌ని పలకరించనుంది ఈ హాట్‌ అండ్‌ క్యూట్‌ అందాల రాక్షసి.

 

ALSO READ: Qlik Here For The Gallery