ENGLISH

Puri Jagannath: అందుబాటులో లేని పూరి... బ‌య్య‌ర్ల‌కు షాక్‌!

20 September 2022-15:11 PM

`లైగర్` క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో బ‌య్య‌ర్లు దాదాపుగా రూ.50 కోట్ల మేర న‌ష్ట‌పోయారు. అవ‌న్నీ సెటిల్ చేస్తాన‌ని పూరి బ‌య్య‌ర్ల‌కు మాటిచ్చాడు.

 

ఒక‌రిద్ద‌రికి సెటిల్ చేశాడు కూడా. కానీ.. మిగిలిన వాళ్ల‌కు మాత్రం రిక్త హ‌స్తాలే మిగిలాయి. పూరి త‌మ‌కు న్యాయం చేస్తాడ‌ని మిగిలిన బ‌య్య‌ర్లు ఎదురుచూస్తున్నారు. అయితే పూరి వాళ్లెవ‌రికీ అందుబాటులో లేడు. పూరికి హైద‌రాబాద్‌లోనూ, ముంబైలోనూ ఆఫీసులు ఉన్నాయి. అవి ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. ప్ర‌స్తుతం పూరి గోవాలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఈ సెటిల్‌మెంట్ వ్య‌వ‌హారాల‌న్నీ పూరి ఛార్మి కి వ‌దిలేశాడ‌ని, అయితే ఇప్పుడు ఛార్మి కూడా అందుబాటులో లేద‌ని టాక్‌.

 

మ‌రోవైపు ఈనెలాఖ‌రులోగా పూరి అంద‌రికీ సెటిల్ చేసేస్తాడ‌ని మాటిచ్చాడ‌ని, అందుకే నెలాఖ‌రు వ‌ర‌కూ ఎదురు చూసి, ఒక‌వేళ సెటిల్‌మెంట్ చేయ‌ని ప‌క్షంలో అక్టోబ‌రు మొద‌టి వారంలో బ‌య్య‌ర్లంతా ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేయాల‌ని భావిస్తున్నార్ట‌. మ‌రోవైపు పూరి కొత్త సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఓ స్టార్ హీరో కోసం స్క్రిప్టు రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. అది అయ్యాకే.. పూరి హైద‌రాబాద్ తిరిగి వ‌స్తాడు.

ALSO READ: 'ఆది పురుష్‌'కి ఇంత చీప్ ప‌బ్లిసిటీనా..?