ENGLISH

బాబోయ్‌ సాయిపల్లవి చుట్టూ ఏంటీ రూమర్లు?

10 March 2018-18:30 PM

ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మ సాయి పల్లవి చుట్టూ వచ్చినన్ని రూమర్స్‌ మరే ఇతర హీరోయిన్‌ విషయంలోనూ రాలేదనే చెప్పాలి. ఆమె నటించిన తొలి సినిమా నుండీ ఇలాగే వివాదాలను ఎదుర్కొంటోంది. అలాగే అనవసరమైన రూమర్స్‌ కూడా క్రియేట్‌ చేసుకుంటోంది. 

ఎన్ని రూమర్స్‌ వచ్చినా సాయి పల్లవి గట్టిగా స్పందించకపోవడమే ఈ రూమర్స్‌ ఇంతలా స్ప్రెడ్‌ అయిపోతున్నాయంటూ ఆమె సన్నిహితులు ఆమెకు సలహాలు ఇస్తున్నా, సాయిపల్లవి పట్టించుకోవడం లేదు. 'ఎంసీఏ' టైంలో నానితో గొడవ అంటూ, 'కణం' సినిమా విషయంలో నాగశౌర్యతో విబేధాలంటూ ఇలా ఒక్కటేమిటి, యాక్టింగ్‌ టాలెంట్‌తో ఎంతగా సాయిపల్లవి పేరు మార్మోగిపోతోందో, అంతకన్నా ఎక్కువగానే ఈ రూమర్స్‌తో కూడా ఆమె పేరు మార్మోగిపోతోంది. 

అయితే తాజాగా సాయిపల్లవిపై వచ్చిన రూమర్‌కి అంతా షాకవుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు జయదేవ్‌తో సాయిపల్లవికి ఎఫైర్‌ ఉందంటూ ఓ రూమర్‌ ప్రచారంలో ఉంది. అయితే ఈ రూమర్‌ ఇంతకు ముందు వాటిలా మరీ ఓపెన్‌గా ప్రచారం కాకున్నా, ఇంటర్నెల్‌గా ఎక్కువగానే ప్రభావితం చూపిస్తోంది. తాజాగా ఈ రూమర్‌ విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించి, ఇలాంటి అనవసర రూమర్స్‌ని ప్రేక్షకులు పట్టించుకోవద్దనీ, ఆ రూమర్‌లో ఎలాంటి నిజం లేదనీ ఆయన స్పష్టం చేశారు. అయితే ఇంత రిస్కీ రూమర్‌ విషయంలో కూడా సాయి పల్లవి స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

కొన్ని రూమర్స్‌ని ఎప్పటికప్పుడే స్పందించి క్లారిటీ ఇచ్చేయాలి. లేకుంటే ఇలాంటి వాటికి బ్రేకులు వేయడం చాలా కష్టం. మరి ఎందుకు సాయి పల్లవి ఈ చిన్న విషయాన్ని గమనించకుండా, కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటోందో తెలియడం లేదు.

ALSO READ: మహేష్ మేనల్లుడు వస్తున్నాడు