ENGLISH

లవ్ స్టోరీ టీమ్ నుంచి దీపావళి పోస్టర్ రిలీజ్

14 November 2020-13:14 PM

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. లవ్ స్టోరీ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. లవ్ స్టోరీ సినిమా థియేటర్ లు ఓపెన్ కాగానే సరైన సమయం చూసుకుని విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. వెలుగుల పండగ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ALSO READ: Sai Pallavi Latest Photoshoot