ENGLISH

అమెరికా సెక్స్ రాకెట్ పై ‘మా’ స్పందన

19 June 2018-19:15 PM

అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్ కి ఇక్కడ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది యాంకర్స్, హీరోయిన్లకి సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లతో ఇప్పుడు అందరి దృష్టి ఇండస్ట్రీ పైనే పడింది.

ఇక ఈ తరుణంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చికాగో సెక్స్ రాకెట్ పైన స్పందించింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ- అమెరికా నుండి ఏవైనా సంస్థలు తమ దగ్గర జరిగే కార్యక్రమాలకి ఇక్కడి ఫిలిం ఇండస్ట్రీకి సంబందించిన వారిని పిలిచినప్పుడు వారు తమని ఒకసారి సంప్రదిస్తే మంచిది అని, ఎందుకంటే ఆ సంస్థ పైన ఫీడ్ బ్యాక్ తమ నుండి తెలుసుకుని అక్కడికి వెళితే మంచిది అని సూచిస్తున్నాము. అలాగే ఈ అంశం పైన చర్చించేందుకు ఈ నెల 24న ఒక మీటింగ్ జరుపుతున్నాము.

మరోవైపు కాంట్రవర్సీకి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచినా శ్రీ రెడ్డి ఈ అంశం పై మాట్లాడుతూ- ఈ సెక్స్ రాకెట్ కి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయి అని వాటిని సరైన సమయంలో బయటపెడతాను అని చెప్పుకొచ్చింది.

అయితే అమెరికాలో పోలీసుల విచారణ పూర్తయితే కాని ఎవరికి పూర్తి వివరాలు తెలియవు.

 

ALSO READ: సంజన ఎలిమినేషన్ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా?