ENGLISH

మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ & రేటింగ్‌

28 March 2025-13:47 PM

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్‌
కథ -రచన: కల్యాణ్‌ శంకర్‌


నటీనటులు: నార్నె నితిన్‌, సంగీత్ శోభన్, రామ్‌ నితిన్‌, ప్రియాంక జవాల్కర్, విష్ణు ఓయ్‌, రమ్య పసుపులేటి, ఐరేని మురళీధర్ గౌడ్, సత్యం రాజేష్, రఘుబాబు
అనీష్ కురువిల్లా, కార్తికేయ సామల, రవి ఆంథోనీ పూదోట, కె.వి. అనుదీప్ (గెస్ట్  రోల్ ), రెబా మోనికా జాన్ (ఐటెం సాంగ్)  


నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య


సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి


బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ: 28 మార్చ్ 2025  
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5  

 

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం  చేసుకుంది. దీనితో మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. యూత్ కంటెంట్ తో నవ్వులు పూయించిన ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి.  ఈ వారం రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ హిట్ అయిందో లేదో మ్యాడ్ బాయ్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసారో లేదో ఈ రివ్యూలో చూద్దాం.        


కథ :
కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ (నార్నే నితిన్), డిడి (సంగీత్ శోభన్), మనోజ్ (రామ్ నితిన్) మూడేళ్ల తర్వాత లడ్డు (విష్ణు) పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్ళిలో కుర్రాళ్ల హంగామా మాములుగా ఉండదు. అంతా ఓకే ఇక పెళ్లికి సిద్ధం అనుకుంటున్న టైంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది. బాధలో ఉన్న విష్ణుని ఓదార్చటానికి ఫ్రెండ్స్ గోవాకు  తీసుకువెళ్తారు. గోవా వెళ్ళాక అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ హాయిగా గడిపేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైం లో ఒక కాస్ట్లీ  నెక్లెస్ చోరీకి గురవుతుంది. ఆ దొంగతనం మ్యాడ్ గ్యాంగ్ పై పడుతుంది. ఆ నక్లెస్ వీళ్ళే దొంగతనం చేసారని భాయ్(సునీల్) వీళ్ళని బెదిరిస్తాడు. పోలీసులు కూడా మ్యాడ్ గ్యాంగ్ వెంట పడతారు. అసలు నక్లెస్ ఎవరు దొంగతనం చేసారు? మ్యాడ్ గ్యాంగ్ కి ఈ దొంగతనంతో సంబంధం ఏంటి? చివరికి మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం నుంచి ఎలా తప్పించుకున్నారు?  పెళ్లి తప్పిపోయాక మ్యాడ్ గ్యాంగ్ గోవా హనీమూన్ కి ఎందుకువెళ్లింది? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ: 
నిర్మాత నాగవంశీ నిజాయితీగా ముందే చెప్పారు కథ లేదని, కథ కోసం సినిమాకు రావద్దని. మ్యాడ్ స్క్వేర్ చూసాకా అదే అనిపిస్తుంది. కథ ఏం లేదు. మ్యాడ్ హిట్ అయ్యింది అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. కానీ మ్యాడ్ లో ఫుల్ కామెడీ ఉంది. హెల్దీ కామెడీ, కొత్త మొహాలు, ఆడియన్స్ ఫ్రెష్‌గా ఫీలయ్యారు. సీక్వెల్ లో అవేవి పెద్దగా వర్కౌట్ అవలేదు. పార్టులు పార్టులుగా సినిమా నవ్వించింది. ఫుల్ టైమ్ ఎంటర్టైన్ మెంట్ మిస్ అయ్యింది. పైగా ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఊహించుకుని వెళ్లిన ఆడియన్స్ కి నిరాశ ఎదురవుతుంది.   'మ్యాడ్‌ స్క్వేర్' స్టార్టింగ్  కామెడీతో స్టార్ట్ అయ్యింది.  లడ్డు పెళ్లిలో కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. గోవా వెళ్లే వరకు ఆడియన్స్ ని మ్యాడ్ బాయ్స్ ఎంటర్టైన్ చేసారు. కానీ ఆ తర్వాత స్లో అయ్యింది. గోవాలో రఘుబాబు ఎపిసోడ్,ప్రియాంకా జవాల్కర్ ఎపిసోడ్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఎక్కడా సస్పెన్స్ క్రియేట్ అవ్వలేదు. 'భాయ్'గా సునీల్ నటన ప్రేక్షకులకి రొటీన్ గా అనిపిస్తుంది. అక్కడక్కడా  సునీల్ కామెడీ టైమింగ్ వల్ల కొన్ని సీన్లు వర్కవుట్ అయ్యాయి. 


మ్యాడ్ స్క్వేర్ లో పాత్రల కంటిన్యూషన్ తప్ప  పార్ట్ వన్ తో పెద్దగా సంబంధం లేదు. ప్రారంభంలో  ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌, వెడ్డింగ్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. కథ గోవాకి షిఫ్ట్ అయ్యాక పక్కదారి పట్టి బోర్ ఫీలింగ్ కలుగుతుంది. పెద్దగా ఆకట్టుకోలేని కామెడీతో సెకండ్ హాఫ్ మైనస్ అయ్యింది. కేవలం కామెడీ బేస్ చేసుకుని తీసిన సినిమాలో కామెడీ అంతగా పండక పొతే ఇంకెందుకు. మ్యాడ్ స్క్వేర్ అనగానే ప్రేక్షకులు కూడా కామెడీ ఆశించే ధియేటర్ కి వెళ్తారు. కథలేదు. కామెడీ లేదు, కొత్తదనం లేదు. లాజిక్స్ ఆశించకుండా చూస్తే పర్వాలేదనిపిస్తుంది. సీక్వెల్ కి ఎప్పుడైనా ఫస్ట్ పార్ట్ తో కంపారిజన్ ఉంటుంది. అలా చూస్తే మ్యాడ్ బెస్ట్ గా నిలుస్తుంది.  


నటీ నటులు:
నార్నే నితిన్, రామ్ నితిన్, సంతోష్ శోభన్ తమ తమ పాత్రలకు మరోసారి న్యాయం చేశారు. నార్నే నితిన్ హీరో మెటీరియల్ అని కొని యాక్షన్ సీన్స్ లో అర్థం అవుతొంది. రామ్ నితిన్ లుక్, కామెడీ టైమింగ్, హావా భావాలు బాగున్నాయి. సంగీత్ శోభన్ తన కామెడీతో ఇద్దర్నీ డామినేట్ చేసి హైలెట్ అయ్యాడు. వీరి ముగ్గురి తరువాత చెప్పుకోదగిన పాత్ర అంటే విష్ణు ఓయ్. విష్ణు  ప్రతి పంచ్ డైలాగ్ బాగా పేలింది. రెబ్బా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో మెరిసింది. ప్రియాంకా జవాల్కర్ స్పెషల్ సాంగ్‌కు గ్లామర్ యాడ్ చేయడంతో పాటు కొన్ని సీన్లలో కనిపించింది. మురళీధర్ గౌడ్ కూడా ఆకట్టుకున్నాడు. మిగతా వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.  


టెక్నికల్ :
దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మొదటి సినిమా హిట్ అవటంతో కొత్త ప్రయోగం ఎందుకని అదే కథతో ట్రావెల్ చేసాడు.  కానీ మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. రెండో సారి తడబడ్డాడు. ఫాస్ట్ హాఫ్ లో కామెడీతో ఆకట్టుకున్నకళ్యాణ్ శంకర్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో స్లో అయ్యాడు. సిసిరోలియో సంగీతం, పాటలు ఈ మూవీకి ప్లస్ అయ్యింది. థమన్ బీజియం బాగుంది. సినిమాటోగ్రఫీ మూవీకి రిచ్ లుక్ తెచ్చిపెట్టింది. గోవా సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సితార ఎంటర్టైమెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.   

 

ప్లస్ పాయింట్స్ 

నటీ నటులు 
సంగీతం 
ఫస్ట్ హాఫ్  


మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్ 
కామెడీ 
రొటీన్ స్టోరీ 


ఫైనల్ వర్దిక్ట్: లాజిక్ లెస్ ఫన్ 'మ్యాడ్ స్క్వేర్'..