ENGLISH

మ‌హేష్‌.. రామ్ ల‌కు దెబ్బ‌కు క్లారిటీ ఇచ్చేశాడు!

15 June 2021-17:00 PM

తెలుగులో ప్ర‌స్తుతానికి విల‌న్ల కొర‌త బాగా పీడిస్తోంది. స్టార్ హీరోలంతా... త‌మ స్థాయికి త‌గిన న‌టుల‌నే విల‌న్లుగా తీసుకోవాల‌నుకుంటున్నారు. అందుకే.. స్టార్ డ‌మ్ ఉన్న న‌టుల‌ను ప్ర‌తినాయ‌కులుగా ఎంచుకుంట‌న్నారు. అవ‌స‌రమైతే భారీ పారితోషికాలు ఇచ్చి, పొరుగు రాష్ట్రం నుంచి విల‌న్ల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నారు. అలా.. విజ‌య్ సేతుప‌తి తెలుగులో స్టార్ విల‌న్ అయిపోయాడు.

 

ఈ మ‌ధ్య మాధ‌వ‌న్ పేరు కూడా గ‌ట్టిగా వినిపించింది. మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌`లో మాధ‌వ‌న్ విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతే కాదు.. రామ్, లింగు స్వామి సినిమాలోనూ త‌నే విల‌న్ అని అనుకున్నారు. దీనిపై మాధ‌వ‌న్ క్లారిటీ ఇచ్చేశాడు. `తెలుగు సినిమాల్లో విల‌న్ గా న‌టిస్తున్నా అనే వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు` అని ఒకే ఒక్క మాట‌తో.. అటు రామ్, ఇటు మ‌హేష్‌ల‌కు క్లారిటీ ఇచ్చేశాడు. సో.. స‌ర్కారు వారి పాట‌లో మాధ‌వ‌న్ విల‌న్ కాద‌న్న‌మాట‌. తెలుగులో `స‌వ్య‌సాచి`, `నిశ్శ‌బ్దం` చిత్రాల్లో మాధ‌వ‌న్ విల‌న్ గా న‌టించాడు.

 

అయితే ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి. అందుకే మాధ‌వ‌న్ విల‌న్ పాత్ర‌ల వైపు మొగ్గు చూపించ‌డం లేద‌ని తెలుస్తోంది.

ALSO READ: జూలై 1 నుంచి థియేట‌ర్లు ఓపెన్‌