ENGLISH

మగధీర-రాబ్తా మధ్య కుదిరిన డీల్!

08 June 2017-16:47 PM

మగధీర చిత్ర కథాంశంతో పోలివుందని హిందీలో రేపు విడుదల కానున్న రాబ్తా చిత్రం పై గీతా ఆర్ట్స్ సంస్థ వారు కోర్టులో వేసిన కేసు ఓ కొలిక్కి వచ్చింది.

అందుతున్న తాజా సమాచారం ప్రకారం, కోర్టు వెలుపలే రాబ్తా మరియు మగధీర చిత్రాల మధ్య తెలెత్తిన వివాదం పరిష్కారం చేసుకున్నట్టు గీతా ఆర్ట్స్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దీనితో రేపు విడుదలకానున్న రాబ్తా చిత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా విడుదల కానుంది.



అయితే పెద్ద చిత్రాల మధ్య ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇటువంటి సెటిల్మెంట్స్ సర్వసాధారణమే అని ఫిలిం నగర్ వర్గాల టాక్.

ALSO READ: బికినీ ధరించినందుకు విమర్శలు ఎదురుకుంటున్న టాప్ హీరోయిన్