ENGLISH

'మహానుభావుడు' తక్కువోడేం కాదు

27 September 2017-13:30 PM

స్టార్‌ హీరోలకు సమానంగా ధైర్యంగా తన సినిమాలను కూడా రిలీజ్‌ చేస్తూంటాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. ఈ విషయంలో యంగ్‌ హీరోలందరికీ స్టార్‌ శర్వానంద్‌ అని చెప్పక తప్పదు. సంక్రాంతికి 'శతమానం భవతి' సినిమాతో వచ్చి, మెగాస్టార్‌, నందమూరి నట సింహాల మధ్య కూడా తానేం తక్కువ కాదని బరిలో దిగి గెలిచాడు శర్వానంద్‌. ఫెస్టివల్‌ రాజా అయిపోయాడు ఇలా మనోడు. గతేడాది సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తోనూ హిట్‌ అందుకున్నాడు. ఈ ఏడాది 'శతమానం భవతి'. ఇప్పుడు సంక్రాంతి తర్వాత పెద్ద పండగ అయిన దసరాకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకి పోటీగా వచ్చాడు 'మహానుభావుడు' సినిమాతో. మారుతి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఎల్లుండి అనగా 29న 'మహానుభావుడు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హెల్దీ కామెడీతో భారీ అంచనాలతో విడుదలవుతోంది ఈ సినిమా. పెద్ద హీరోల సినిమాలు ఎన్ని ఉన్నప్పటికీ, మా సినిమాకీ ఆడియన్స్‌ వస్తారంటూ నమ్మకంగా చెబుతోంది చిత్ర యూనిట్‌ ఈ సినిమా గురించి, అతి శుభ్రం అనే కాన్సెప్ట్‌ని పట్టుకుని డైరెక్టర్‌ మారుతి శర్వానంద్‌లాంటి హీరో చేత నవ్వులు పూయించిన విధానం ఈ సినిమాలో మెయిన్‌ ఎలిమెంట్‌. మెహరీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. శర్వా - మెహరీన్‌ జంట క్యూట్‌గా స్వీట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. సంక్రాంతికి వరుసగా రెండు హిట్లు కొట్టి సంక్రాంతి హీరో అయిపోయిన శర్వానంద్‌ దసరా సక్సెస్‌ని కూడా దక్కించుకుంటాడేమో చూడాలిక.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్