ENGLISH

కల్కి కోసం మహేష్, రానా పోటీ

08 May 2024-20:10 PM

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి'. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా దీపికా పడుకొనే నటిస్తోంది. ఈమెకి ఇదే తొలి సౌత్ సినిమా.  కల్కి మూవీ పై వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది. బాహుబలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి ప్రపంచం నలుమూలల ఫాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ కూడా దాదాపు 1000 కోట్లు వసూల్ చేసింది. దీనితో ఇప్పుడు కల్కిపై భారీ అంచనాలు  నెలకొన్నాయి. ఈక్రమంలో ఈ మూవి నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి సొషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.               


కల్కి మూవీలో దగ్గుబాటి రానా భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది  ఏ రకంగా  అంటే, కల్కి లో రానా వాయిస్ ఓవర్ ఉంటుందని టాక్. బాహుబలి తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ద్వయం మళ్ళీ కలిస్తే బాగుంటుందని మేకర్స్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఒక న్యూస్ వినిపిస్తోంది.  ఇప్పటికే రానా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ బాబు పేరు కూడా వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ విష్ణు  మూర్తి  గెటప్ లో కనిపించినప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పనున్నారని, విష్ణు మూర్తి అవతారాన్ని పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.


అంటే రానా, మహేష్ ఇద్దరు కల్కి కి వాయిస్ ఓవర్ అందించారా? లేదా ఇద్దరిలో ఎవరో ఒకరే వాయిస్ అందిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ ఇప్పటికే కొన్ని సినిమాలకి వాయిస్ ఓవర్ అందించారు. రానా వాయిస్ కి ప్రత్యేక బేస్ ఉంటుంది. ఈ రెండిటిలో ఏది నిజమైనా కానీ ఈ మూవీకి ఇదొక హైలెట్ అనే చెప్పొచ్చు. రానా, మహేష్ ఇద్దరిలో ఎవరైనా కానీ కల్కి సినిమాకి ప్లస్ అవుతారు. ఇద్దరూ వాయిస్ అందిస్తే ఆ కిక్కే వేరు.