ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్ గా సెకండ్ పార్ట్ కూడా రానుంది అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కల్కి మూవీలో పురాణ పాత్రలు చాలా కనిపించాయి. వీటి కోసం స్టార్ కాస్ట్ ని రంగంలోకి దింపాడు నాగ్ అశ్విన్. అర్జునుడి పాత్రలో విజయ్ దేవర కొండ, అశ్వద్ధామగా అమితాబ్, కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించారు. కానీ ఇందులో మరికొన్ని పాత్రలు ఉన్న వీటి గూర్చి డిటైల్డ్ గా చూపించలేదు. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో కీలకంగా ఉన్న కృష్ణుడి పాత్రను రివీల్ చేయలేదు.
కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా కృష్ణుడి పాత్రను చూపించి కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ తో డబ్బింగ్ చెప్పించారు. అయితే కల్కి పార్ట్ 2 లో కృష్ణ పాత్ర ఎలాబిరేట్ చేసి, ఫేస్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ కృష్ణుడి క్యారక్టర్ గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కి పార్ట్ 2 లో కూడా శ్రీకృష్ణుడి లుక్ను రివీల్ చేయాలని అనుకోవడం లేదని, కారణం సినిమా పై ఆ పాత్ర ఎఫెక్ట్ ఎక్కువ అయ్యి ట్రాక్ తప్పిపోతుంది అని తెలిపారు.
అంతే కాదు ఒక వేళ మూవీలో కృష్ణుడి పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటే అందులో మహేష్ బాబు నటిస్తే ఫేస్ రివీల్ చేస్తా అని మాటిచ్చాడు నాగ్ అశ్విన్. నిజంగా అదే నిజమైతే కల్కి రేంజ్ మరికొంత పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న కాస్టింగ్ కి మహేష్ ఛరిష్మా కూడా తోడైతే ఇంకేమైనా ఉందా. అశ్విన్ మనసులో లేకుండా ఈ మాట రాదుగా అని సినీప్రియులు గుసగుస లాడుతున్నారు. అయితే కల్కి 2 లో మహేష్ ని కృష్ణుడిగా చూసే ఛాన్స్ ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని తెలిపాడు అశ్విన్.