ENGLISH

ఇక్కడా మళ్ళీ మహేషే నెంబర్‌ వన్‌!

23 September 2020-10:00 AM

కరోనా సీజన్‌ నుంచి ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌కి ఉపశమనం కలుగుతోంది. మళ్ళీ సినిమా షూటింగులు షురూ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. ఇంకొన్ని మాత్రం సినిమా హాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇదిలా వుంటే, కరోనా నేపథ్యంలో ‘బ్రాండ్‌ అండార్స్‌మెంట్స్‌’ కూడా గణనీయంగా తగ్గిపోవడంతో తారలు డీలా పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ అవి కూడా జోరందుకుంటున్నాయి. హీరోలు, హీరోయిన్లు.. ఆయా ప్రకటనల షూటింగుల్లో అల్రెడీ బిజీగా వున్నారు.

 

సినిమా షూట్స్‌తో పోల్చితే, ఇవి చాలా చాలా తక్కువ సమయంలో పూర్తయిపోతాయి. అలాగని, వచ్చే ఆదాయం తక్కువేమీ కాదు. కరోనా తర్వాత బ్రాండ్‌ అండార్స్‌మెంట్‌ విషయంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు అందరికన్నా ముందున్నాడనేది తాజా ఖబర్‌. ఇప్పటికే ఒకటి రెండు యాడ్‌ షూట్స్‌లో పాల్గొన్న మహేష్‌, మిగతా స్టార్‌ హీరోల కంటే ముందంజలో వున్నాడు. ఇంకా ఈ లిస్ట్‌లో చేరాల్సిన స్టార్‌ హీరోలు చాలామందే వున్నా, కొన్ని కారణాలతో ఆయా స్టార్స్‌ ‘బ్రాండ్‌ అండార్స్‌మెంట్స్‌’ విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

 

టాలీవుడ్‌లో బ్రాండ్‌ అండార్స్‌మెంట్స్‌ విషయానికొస్తే మహేష్‌బాబు చాలాకాలంగా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా సీజన్‌లోనూ మహేష్‌కి తిరుగే లేదని ఇంకోసారి నిరూపిమతువోతంది. ఇదిలా వుంటే, మహేష్‌ తన తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ కోసం సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

ALSO READ: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. ఈసారి పక్కా.!