ENGLISH

'భరత్‌ అనే నేను' మహేష్‌ కెవ్వుకేక

06 October 2017-11:18 AM

మహేష్‌బాబు మాంచి జోరు మీదున్నాడు. అభిమానులకు పండగలాంటి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇటీవలే 'స్పైడర్‌' సినిమాతో సూపర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేష్‌ బాబు అభిమానులకు మరో గిఫ్ట్‌నీ ఇచ్చాడు. అదే 'భరత్‌ అనే నేను' సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశాడు. ఈ లుక్‌లో మహేష్‌ని చూస్తుంటే అభిమానులకు రెండు కళ్లూ చాలడం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. 'శ్రీమంతుడు' వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ వీరిద్దరిది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ చేయగానే అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఇక ఫస్ట్‌లుక్‌ విడుదలవగానే ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్‌ ద్వారా ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చేసింది. ముందు ఇద్దరు గన్‌మెన్‌లు నడుస్తుండగా, వెనక మహేష్‌ నడుచుకుంటూ వస్తున్నారు. మహేష్‌ వెనక బ్రహ్మాజీ కూడా ఉన్నాడు. మైండ్‌ బ్లోయింగ్‌ లుక్‌. ఆల్రెడీ షూటింగ్‌ పనుల్లో ఉంది ఈ సినిమా. ఉత్తర ప్రదేశ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సినిమాకి మహేష్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వాణీని తీసుకొచ్చారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'స్పైడర్‌'తో రికార్డులు కొల్లగొడుతోన్న మహేష్‌ ఈ సినిమాతో ఏం చేస్తాడో చూడాలిక.

ALSO READ: Live Updates On Naga Chaitanya-Samantha Wedding