ENGLISH

మహేష్ అలియాస్ భరత్ ఎప్పుడు వస్తాడో తెలుసా?

18 October 2017-20:11 PM

బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు నిరాశకి  గురిచేయడంతో మహేష్ తదుపరి చిత్రం ‘భరత్ అను నేను’ పైన బోలేడంత ఆశలు పెరిగిపోయాయి.

ఈ తరుణంలో దర్శకుడు కొరటాల శివ కూడా ఈ చిత్రంపైన మరింత శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పరంగా దూసుకుపోతున్న ఈ చిత్రం విడుదల తేదీపైన ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే- ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 20వ తేదిన విడుదల చేసేందుకు దర్శక-నిర్మాతలు ప్లాన్  చేస్తున్నట్టు సమాచారం.

వేసవి సీజన్లో అయితేనే చిత్రానికి కలెక్షన్స్ భాగా వస్తాయి అని అంచనాతో ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఇదిలావుండగా బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని ఈ చిత్రంలో మహేష్ సరసన నటిస్తున్నది.

 

ALSO READ: రాజా ది గ్రేట్ రివ్యూ & రేటింగ్స్