ENGLISH

మనోజ్‌ 'ఒక్కడు' అదరగొట్టేశాడు

15 June 2017-12:33 PM

మంచు మనోజ్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నాడంటూ ట్విట్టర్‌లో షాకిచ్చి, కాస్సేపటికే మాట మార్చేసిన మనోజ్‌ ఫ్యాన్స్‌లో ఒకింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు. మీడియా దృష్టినీ ఆకర్షించాడు. అది సరే. తాజాగా మనోజ్‌ నటించిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా టీజర్‌ వచ్చింది. దీంతో మనోజ్‌ మరోసారి వార్తలకు కేంద్ర బిందువయ్యాడు. 'ఒక్కడు మిగిలాడు' సినిమా కాన్సెప్ట్‌ ఓ పోరాట యోధుడి గాధ అనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు అమెరికానే గడగడలాడించిన పోరాట యోధుడుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చేగువేరాని జనం ఎప్పటికీ మర్చిపోలేదు. యూత్‌కి ఐకాన్‌ చేగువేరా. ఈ మధ్య యంగ్‌ హీరోస్‌ తమ చిత్రాల్లో చేగువేరాని వివిధ రకాలుగా వాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు అలాంటి మహానుభావుడి జయంతి సందర్భంగా యంగ్‌ హీరో మంచు మనోజ్‌ తన సినిమా టీజర్‌ని విడుదల చేశాడు. దాంతో మనోజ్‌ టైమింగ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంతా. ఎల్‌టిటిఎ ఛీప్‌ ప్రభాకరన్‌ పాత్రలో మనోజ్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు. రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో మనోజ్‌ ఈ సినిమాలో కనిపించనున్నాడు. సాధారణ కాలేజీ కుర్రాడి పాత్ర ఒకటైతే, మరోటి ఎల్‌టిటిఎ చీఫ్‌ ప్రభాకరణ్‌ పాత్ర. ఈ పాత్ర కోసం మనోజ్‌ చాలా లావుగా మారిన సంగతి తెలిసిందే. 'చిందేస్తూ నా ప్రాణాన్ని, చిందిస్తా నా రక్తాన్ని.. అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో మనోజ్‌ చెప్పే లెంగ్దీ డైలాగ్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. టీజర్‌ చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ALSO READ: హీరో కుమార్తె హీరోయిన్‌గా తెరంగేట్రం