ENGLISH

మరొక వివాదంలో మంచు విష్ణు

31 December 2024-13:34 PM

ఈ మధ్య వరుస వివాదాల్లో ట్రెండింగ్ లో ఉన్న మంచు ఫ్యామిలీ, ఇప్పుడు మరొక వివాదం లో చిక్కుకుంది. నిన్న మొన్నటి వరకు కుటుంబం వివాదాలతో రోడ్డెక్కింది. మోహన్ బాబు, మనోజ్ ఆస్తి వివాదాలతో కొట్టుకుని రోడ్డెక్కారు. ఒకరి పై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయటం కేసు ఫైల్ అవటం తెలిసిందే. నెక్స్ట్ మనోజ్ , విష్ణు పోలీసులకి బైండోవర్ రాసి ఇచ్చారు. ఓ రెండు రోజులు కామ్ గా ఉన్న వీరు మళ్ళీ వివాదాలతో మీడియా కెక్కారు. మనోజ్, విష్ణుపై ఆరోపణలు చేయటంతో మనోజ్ తల్లి కూడా ఓపెన్ గా లెటర్ రాసారు.

మీడియా పై దాడి కేసులో అరెస్ట్ చేస్తారని ముందు జాగ్రత్తగా మోహన్ బాబు దుబాయ్ చెక్కేశారు. అంతా సర్దుకుంది, న్యూ ఇయర్ లో మంచు వివాదాలు సమసి పోయాయి అనుకున్న టైం లో ఇంకో వివాదంలో చిక్కుకుంది మోహన్ బాబు ఫ్యామిలీ. అయితే ఈ సారి ఫ్యామిలీ గొడవలు కాదు. సెక్యూరిటీ నిర్వాకం వ‌ల్ల ట్రోల్స్ కి గురి అవుతున్నారు. జ‌ల్ ప‌ల్లిలో మోహన్ బాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడం ఇప్పడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశమైంది.

జ‌ల్‌ప‌ల్లి అడ‌విలో విష్ణు మేనేజ‌ర్ కిరణ్, ఎల‌క్ట్రిష‌న్ దేవేంద్ర ప్రసాద్ అడ‌వి పందిని వేటాడి చంపి తీసుకువెళ్తున్న దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. దీనితో నెటిజన్స్ విష్ణు సిబ్బంది పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మనోజ్ చాలా సార్లు అడ‌వి పందులను వేటాడొద్ద‌ని మేనేజ‌ర్ కి, ఎల‌క్ట్రిష‌న్ కి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా వారు పదే పదే ఇలాగే చేస్తున్నారని. ఇదేం మొదటిసారి కాదని తెలుస్తోంది. సిబ్బంది చేసిన నిర్వాకానికి విష్ణు మరొకసారి వార్తల్లో నిలిచారు. అంతే కాదు విష్ణు ఇప్పడు ఈ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ALSO READ: బన్నీ - త్రివిక్రమ్ కాంబో కోసం హ్యారిస్ జైరాజ్