ENGLISH

Sunny Leone: స‌న్నీలియోన్‌ని న‌మ్ముకొన్న విష్ణు

12 October 2022-18:40 PM

మంచు విష్ణు సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. `మోస‌గాళ్లు` త‌ర‌వాత విష్ణు సినిమా ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న్నుంచి ఓ సినిమా వ‌స్తోంది. అదే... `జిన్నా`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈనెల 21న రిలీజ్ అవుతోంది.

 

దీపావ‌ళి కోసం బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ ఏర్ప‌డింది. ఏకంగా నాలుగైదు సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. వాటి మ‌ధ్‌య `జిన్నా`కి వ‌సూళ్లు రావ‌డం గ‌గ‌నమే. ఎందుకంటే.. విష్ణు సినిమాపై ఎవ‌కికీ న‌మ్మ‌కాల్లేవు. ఇటీవ‌ల ట్రైల‌ర్ వ‌చ్చింది. అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే.. విష్ణు మాత్రం `జిన్నా` పై న‌మ్మ‌కంతో ఉన్నాడు. లో ప్రొఫైల్ లో విడుద‌ల కావ‌డ‌మే త‌న బ‌లం అని విష్ణు న‌మ్ముతున్నాడు. మ‌రోవైపు ఈ సినిమాలో స‌న్నీలియోన్ క‌థానాయిక‌గా న‌టించింది. ఆమె ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌దు అని న‌మ్ముతున్నాడు విష్ఱు. ఇది వ‌ర‌కు స‌న్నీలియోన్ తెలుగులో `క‌రెంటు తీగ‌` అనే సినిమాలో న‌టించింది. మ‌నోజ్ హీరోగా చేసిన సినిమా అది. అప్ప‌ట్లో స‌న్నిని చూడ్డానికే యూత్ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. అయితే.. ఇవి అప్ప‌టి రోజులు కావు.

 

స‌న్నీలియోన్ దాదాపుగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోయిన్‌. ఆమెను న‌మ్ముకొంటే ఎలా? ఈ సినిమాలో మ‌రో క‌థానాయిక పాయ‌ల్ రాజ్ పుత్ కూడా ఉంది. త‌న ప‌రిస్థితీ అంతంత మాత్ర‌మే. ఇద్ద‌రు ఫేడ‌వుట్ హీరోయిన్ల‌ని పెట్టుకొని, ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌గ‌ల‌మంటే ఎలా విష్ణు..??

ALSO READ: Sunny Leone Latest Photoshoot