ENGLISH

విష్ణు.. ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..?!

31 January 2022-11:02 AM

ఎందుకో మంచు ఫ్యామిలీ సినిమాల విష‌యంలో బాగా వెన‌క‌బ‌డ్డారు. మ‌నోజ్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న అడపా ద‌డ‌పా క‌నిపించినా ఆమెకు విజ‌యాలు ద‌క్క‌డం లేదు. విష్ణు ప‌రిస్థితీ అంతే. యేడాదికి ఒక‌టి, రెండేళ్ల‌కు ఒక‌టి అంటూ ఆచి తూచి సినిమాలు చేస్తున్నా, త‌న‌కి కాలం క‌ల‌సి రావ‌డం లేదు. ఇటీవ‌ల `మోస‌గాళ్లు` అనే సినిమా చేశాడు. ఈ సినిమా కోసం దాదాపు 50 కోట్లు ఖ‌ర్చు పెట్టాడ‌ని టాక్‌. తీరా చూస్తే ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయ్యింది. శ్రీ‌నువైట్ల‌తో `డీడీ `సినిమా ప్ర‌క‌టించారు కానీ, దానికి సంబంధించిన అప్ డేట్ ఇప్ప‌టి వ‌ర‌కూ లేదు.

 

అయితే ఇప్పుడు విష్ణు సినిమాకి సంబంధించిన ఓ కొత్త అప్‌డేట్ వ‌చ్చింది. మంచు విష్ణు హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రాజేంద్ర ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్త‌య్యింద‌ట‌. ఈ సినిమా ఓయాక్ష‌న్‌, ఎమోషనల్ డ్రామా అని.. సినిమాలో మంచు విష్ణు ఒక ‘రా’ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే శ్రీ‌నువైట్ల సినిమా కూడా ప‌ట్టాలెక్కుతుంద‌ట‌. చూద్దాం... 2022లో అయినా... విష్ణుకి హిట్ వ‌స్తుందేమో..?

ALSO READ: బ‌న్నీకంటే ముందే.. రామ్‌తో?