ENGLISH

తప్పంతా నాదే అని ఒప్పుకున్న మనిషా కొయిరాలా!

10 June 2017-17:13 PM

మనీషా కొయిరాల- ఇప్పటికి ఈ పేరు చెబితే ప్రేక్షకుల్లో ఏదో తెలియని అలజడి. అందంతోనే కాకుండా అభినయంతోను ప్రేక్షకుల మదిని దోచేసిన ఈ ముద్దుగుమ్మ చాలా కాలం తరువాత వెండి తెరపై మేరవనుంది.

డియర్ మాయా అనే పేరుతో రాబోతున్న చిత్రంలో ఈమెది టైటిల్ పాత్ర. అయితే ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమెకి సంభందించిన కొన్ని వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. 

తన వివాహం విఫలమవడానికి కారణం తానే అని అందులో తన మాజీ భర్త పాత్ర ఏమిలేదని చెప్పుకొచ్చింది. పెళ్ళయిన రెండేళ్లలోలోనే ఆమె వివాహ బంధం నుండి బయటకి వచ్చేసింది.

మొత్తానికి తన జీవితంలో జరిగిన ఆ పెద్ద సంఘటనకి తానే కారణం అని నిజాయితీగా ఒప్పుకుంది.

 

ALSO READ: దీపిక పైన విమర్శల వెల్లువ