ENGLISH

ఐటం నంబర్‌గా వస్తానంటోన్న ‘హాట్‌’ పాప!

18 October 2020-13:08 PM

బబ్లీ బ్యూటీ మన్నారా చోప్రా, తెలుగులో పలు సినిమాలు చేసిందిగానీ, హీరోయిన్‌గా సరైన గుర్తింపు అయితే ఆమె ఇంకా సంపాదించుకోలేకపోయింది. సరైన ఛాన్సులు కూడా ఇప్పుడామెకు రాకపోవడంతో, ఐటం బాంబుగా మారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోందని సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ యంగ్‌ హీరో నటిస్తోన్న సినిమా కోసం స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు డీల్‌ సెట్‌ చేసుకుందట ఈ ముద్దుగుమ్మ. ‘సీత’ సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌కి పరిమితమైపోయిన మన్నారా, కాలం కలిసొస్తే తనకూ స్టార్‌ హీరోయిన్‌ అయ్యేంత టాలెంట్‌ వుందని చెబుతోంది.

 

స్పెషల్‌ సాంగ్స్‌ చేయడాన్ని కూడా ఇష్టపడతానని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ చోప్రా గర్ల్‌ కొన్ని బాలీవుడ్‌ సినిమా ఆఫర్లనూ దక్కించుకుందట. తమిళ సినీ పరిశ్రమ నుంచీ అవకాశాలొస్తున్నాయంటోంది. కరోనా నేపథ్యంలో కెరీర్‌ కొంచెం స్లో అయ్యింది తప్ప, తనకు ఆయా సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపే వుందంటూ ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

 

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండడం ద్వారా ఓ మోస్తరుగా అభిమానుల్నీ సంపాదించుకుంది మన్నారా చోప్రా. ఇంతకీ, మన్నారా చేయనున్న ఐటం సాంగ్‌ ఏ సినిమా కోసం.? అంటే, అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సేనట. కొన్ని రోజుల్లో ఆ వివరాలు వెల్లడవుతున్నాయట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కిస్తోందని సమాచారం.

ALSO READ: 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' బాట‌లో 'ఆచార్య‌'