ENGLISH

మ‌రక‌త‌మ‌ణి మెర‌వాల్సిందే!

05 June 2017-11:26 AM

ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడు ఆది పినిశెట్టి తండ్రి బాట‌లో ద‌ర్శ‌కుడు అవ్వ‌కుండా.. న‌టుడిగా రాణించాల‌న్న త‌ప‌న‌తో అడుగులు వేశాడు. త‌ను మంచి న‌టుడ‌న్న‌ది ఎప్పుడో నిరూపిత‌మైంది. అయితే కావ‌ల్సింద‌ల్లా ఓ మంచి విజ‌య‌మే. స‌రైనోడులో విల‌న్‌గా క‌నిపించి, అంద‌రికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు హీరోగానూ ఓ విజ‌యం అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.  ఆది కి ఉన్న గుర్తింపు దృష్ట్యా త‌ను న‌టించిన త‌మిళ చిత్రాల్ని తెలుగులో డ‌బ్ చేయ‌డం ప‌రిపాటి అయ్యింది. అయితే.. వాటిలో విజ‌యాలు సాధించిన‌వి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా స‌రే... ఆ ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా త‌మిళ చిత్రం మ‌ర‌క‌త‌మ‌ణిని తెలుగులో డ‌బ్ చేశారు.

శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిక్కీ గ‌ల్రానీ క‌థానాయిక‌గా న‌టించింది. కోట‌, బ్ర‌హ్మానందం ల‌ను తీసుకొచ్చి.. దీనికి స్ట్ర‌యిట్ తెలుగు సినిమానే అనే లుక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ట్రైట‌ర్ ఓకే అనిపిస్తోంది. థ్రిల్ల‌ర్‌, హార‌ర్ ల‌క్ష‌ణాలు పుక్ష‌లంగా క‌నిపిస్తున్నాయి.  ఆది కెరీర్‌లో వెలుగులు నిండాలంటే.. ఈమ‌ణి మెర‌వాల్సిందే.

ALSO READ: బాల‌య్య టైటిల్ 'తేడా'గా ఉందే..!