ENGLISH

శ్రీదేవికి కొత్త కష్టం వచ్చింది

06 June 2017-13:06 PM

అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో 'మామ్‌' సినిమా తెరకెక్కుతోన్న సంగతి విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీదేవి అభిమానుల ముందుకు తరచూ వస్తున్నారు. అయితే తన సినిమా ప్రమోషన్‌ కోసం వస్తోన్న శ్రీదేవికి ఎక్కడికి వెళ్లినా చుక్కెదురౌతోంది. మీడియా సవాలక్ష ప్రశ్నలతో విసిగిస్తోందని వాపోతోంది అందాల శ్రీదేవి. 'మామ్‌' ప్రమోషన్స్‌కని వస్తే, శ్రీదేవి కూతురు జాహ్నవి గురించి రకరకాల ప్రశ్నలు వేస్తోందట మీడియా. ఆ ప్రశ్నలకు శ్రీదేవి విసుగు చెందుతోందట. జాహ్నవి సినిమా ఎంట్రీ గురించి, ఆమె ప్రేమాయణం గురించి, తదితర విషయాలపై శ్రీదేవిని ప్రశ్నిస్తున్నారట మీడియా సోదరులు. ఎప్పుడూ శ్రీదేవి మీడియాతో ఫ్రెండ్లీగా, హుందాగా వ్యవహరించేది. కానీ ఇప్పుడు మాత్రం విసుగు చెందుతోందట. దాంతో ఆమెకు తన సినిమా ప్రమోషన్‌ చాలా కష్టమైపోయిందంటోంది. ఆమె సహనానికి హద్దులు చెరిగిపోతున్నాయట. దాంతో జాహ్నవి విషయం తన వద్ద ప్రస్థావించవద్దనీ, ఆమె హీరోయిన్‌ ఎంట్రీ విషయంలో సెపరేటుగా క్లారిటీ ఇస్తాననీ, తాను చెప్పేదాకా ఆమె గురించి అడగొద్దనీ శ్రీదేవి ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో జాహ్నవి గొడవ ఒకింత కామ్‌ అప్‌ అయ్యిందనుకుంటే, మళ్లీ 'బాహుబలి' గురించి ఎత్తుతున్నారట. 'బాహుబలి'లో 'శివగామి' పాత్ర ముందుగా శ్రీదేవి దగ్గరకే వెళ్లింది. అయితే ఆమె ఆ అవకాశం వదులుకున్న కారణంగా ఆ అరుదైన అవకాశం రమ్మకృష్ణని వరించింది. ఈ విషయం కూడా పదే పదే శ్రీదేవి దగ్గర ప్రస్థావిస్తున్నారు. దాంతో అతిలోక సుందరికి ఇరిటేషన్‌ ఎక్కువైపోతోందట. వచ్చే నెల్లో శ్రీదేవి నటించిన 'మామ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది శ్రీదేవికి 300వ చిత్రం.

 

ALSO READ: 'డిజె'లో నమకం, చమకం లేనట్టే