ENGLISH

బాల‌య్య కోసం దిగొచ్చిన మీనా

07 September 2020-17:30 PM

ఒక‌ప్పుడు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి, తిరుగులేని క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది మీనా. ఇటీవ‌ల దృశ్యంతో రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే.. ఆ త‌ర‌వాత‌, కావాల‌నే సినిమాల్ని త‌గ్గించుకుంది. ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా.. ఓకే చేయ‌లేదు. అయితే ఇప్పుడు బాల‌య్య కోసం దిగి వ‌చ్చింది.

 

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమాలోని ఓ కీల‌క పాత్ర కోసం మీనాని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాలూ, షూటింగులు అంటే అంతా భ‌య‌ప‌డిపోతున్నారు. మీనా లాంటి వాళ్ల‌కు ఇలాంటి రిస్క్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఇది బాల‌య్య సినిమా. బాల‌య్య‌తో మీనాకు మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు కూడా. అందుకే బాల‌య్య కోసం మీనా ఓకే అనేసింద‌ట‌. త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌య్యే కొత్త షెడ్యూల్ లో మీనా కూడా సెట్లో అడుగుపెడుతుంద‌న్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో క‌థానాయిక ఇంకా ఖ‌రారు కాలేదు. ఆమెను కూడా త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ALSO READ: హ‌రీష్ శంక‌ర్ ఆగ‌లేక‌పోతున్నాడ‌ట‌