ENGLISH

సంక్రాంతి బరిలోకి మెగా 154

24 June 2022-14:52 PM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ, మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా 154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ చ్చింది చిత్ర యూనిట్. “కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023,” అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతికి ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం ఆసక్తికరంగా వుంది. ప్రస్తుతం ఈ చిత్రం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది . అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ALSO READ: సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్