ENGLISH

అక్కినేని హీరోతో మేఘా ఆకాష్?!

13 September 2017-13:05 PM

నితిన్ ‘లై’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మేఘా ఆకాష్ ప్రస్తుతం రామ్ తో కలిసి 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలో నటిస్తుండగా, ఇప్పుడు మరొక బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే, నాగ చైతన్య-మారుతీ కలయికలో త్వరలోనే మొదలుకానున్న చిత్రంలో హీరోయిన్ గా మేఘా ఆకాశ ని పరిశీలిస్తునట్టు సమాచారం. ఇక ఇప్పటికే మేఘా ‘లై’ చిత్రంలో తన అభినయంతో ప్రేక్షకులని ఆకట్టుకోగా ఇప్పుడు ఈ ఆఫర్ గనుక తన ఖాతాలో పడితే తన కెరీర్ కి ఇక తిరుగుండదు అని ఇండస్ట్రీ వర్గాల అంచనా.

మరి ఈ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.

 

ALSO READ: నటుడు చిన్నా ఇంట్లో విషాదం