ENGLISH

మెహరీన్‌ కాస్ట్‌లీ మిస్టేక్‌

19 September 2017-16:46 PM

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ మెహరీన్‌ సోషల్‌ మీడియాలో తెలియకుండా ఓ చిన్న మిస్టేక్‌ చేసింది. అది పెద్ద మిస్టేక్‌గా మారి కొందరికి అభ్యతరకరంగా మారింది. దేశానికి బోలెడన్ని పతకాలు తెచ్చి పెడుతున్న బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధును ఉద్దేశించి ముద్దుగుమ్మ మెహరీన్‌ ఆమెకు అభినందనలు తెలిపే క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 'తెలంగాణా బంగారం సింధు' అని ఆమెకు వచ్చిన తెలుగును వాడింది. అయితే ఆ పదం నెటిజన్లకు కోపమొచ్చింది. కొంతమంది ఆంధ్రా ఫీలింగ్‌ చూపించారు. కొంత మంది తెలంగాణా ఫీలింగ్‌ చూపించారు. ఎక్కువ మంది ఆంధ్రా, తెలంగాణా అనొద్దు. తెలుగమ్మాయి అను అని ఆమెకి చిన్నగా చురకలు అంటించారు. పాపం మెహరీన్‌కి తెలీదు కదా. ఆంధ్రా, తెలంగాణా గొడవ. నెటిజన్ల కామెంట్స్‌తో తేరుకుని రెండో రోజు తన పోస్ట్‌ కరెక్షన్‌ చేసుకుంది. 'తెలుగు బంగారం.. క్షమించండి..' అని రీ పోస్ట్‌ చేసింది. అయినా కానీ తెలంగాణా బంగారం, ఆంధ్రా బంగారం అని ఏదో ఒక ప్రాంతానికే ఎలా పరిమితం చేస్తారు. మనమంతా ఇండియన్స్‌ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అయినా ఆంధ్రా అంటే ఏంటి? తెలంగాణా అంటే ఏంటి? ఆంధ్రా అంటే తెలుగు, తెలంగాణా అంటే తెలుగుకు ఆణా.. ఇదీ తెలుసుకోవల్సింది. అంతేకానీ ఛాన్స్‌ ఉంది కదా అని సోషల్‌ మీడియాలో ట్రాలింగ్‌ చేయడం మంచిది కాదు. నెటిజన్లు ఈ సంగతి గుర్తిస్తే బావుంటుంది.

ALSO READ: ప్రియుడికి బర్త్‌డే గిఫ్ట్‌: నయనానందకరం