'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా నటించిన మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం తెగ ఫ్రస్టేషన్ ఫీలవుతోందట. ఇంతకీ ముద్దుగుమ్మకి ఎందుకంత ఫ్రస్టేషన్.. అంటారా.? సినిమాలు పరాజయం పాలవడంలో హీరోయిన్స్ పాత్ర ఎంతవరకూ ఉంటుంది.? అని డైరెక్ట్‌గా మెహ్రీన్‌ని ప్రశ్నించారట ఈ మధ్య ఎవరో. ఆ ప్రశ్నకు చాలా ఫీలయిన మెహ్రీన్, తనలోని ఫ్రస్టేషన్ అంతా వెళ్లగక్కేసిందట. ఒక సినిమా రూపొందాలంటే, దాని వెనక హీరో, హీరోయిన్, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ కష్టం, బాధ్యత దాగి ఉంటాయి. సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ హీరో, డైరెక్టర్ ఖాతాలో వేసేస్తారు.
ఫ్లాప్ అయితే హీరోయిన్ ఖాతాలో ఎందుకు పడేస్తారు.? అంటూ ఎదురు ప్రశ్నించి, సదరు ప్రశ్నదారుడికి గట్టిగా కౌంటర్ ఇచ్చిందట. ఇటీవల మెహ్రీన్ నటించిన 'ఎంత మంచి వాడవురా' చిత్రం ఈ సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సినిమాగా పెద్ద సినిమాలతో రేసులోకి దిగిన ఈ సినిమా ఆశించిన మేర విజయం అందుకోలేకపోయింది. అలా అని ఆ తప్పు మెహ్రీన్‌పై నెట్టడం సబబు కాదు కదా. మరోవైపు ఇదే సీజన్‌లో తమిళంలో వచ్చిన 'పటాస్' మూవీ మెహ్రీన్‌కి మంచి విజయాన్ని కట్టబెట్టింది.
ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. హిట్, ఫ్లాపులు అనేవి ఎవరి చేతుల్లోనూ ముఖ్యంగా హీరోయిన్స్ చేతిలో ఉండవని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. మరోవైపు వెరీ లేటెస్ట్‌గా మెహ్రీన్ 'అశ్వథ్ధామ' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. థ్రిల్లర్ మూవీ కాబట్టి ఈ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మెహ్రీన్‌కి పెద్దగా కలిసి రావనే చెప్పాలి.
ALSO READ: 'అశ్వద్ధామ' మూవీ రివ్యూ & రేటింగ్!