ENGLISH

మెహరీన్‌ ఆనందానికి ఆకాశమే హద్దు

27 September 2017-18:14 PM

'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో అమాయకంగా కనిపించే క్యూట్‌ ఫేస్‌తో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌. తొలి సినిమాకే సూపర్‌ సక్సెస్‌ అందుకుని లక్కీ గాళ్‌ అనిపించేసుకుంది. తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకున్నా మళ్లీ ఈ లక్కీ గాళ్‌ వచ్చేస్తోంది. ఒక్క సినిమాతో అనుకుంటే పొరపాటే. ఎక్కడ చూసినా, మెహరీనే. ఎవరి నోట విన్నా మెహరీన్‌ పేరే అన్నట్లుగా రాకెట్‌ స్పీడుతో దూసుకొచేస్తోంది. ఒక్కటి కాదు, రెండు కాదు ఎన్ని సినిమాలు ఉన్నాయో లేక్కే లేదన్నంతగా మెహరీన్‌ సినిమాలు విడుదలకు క్యూ కడుతున్నాయి. అతి త్వరలో 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎల్లుండే 'మహానుభావుడు' రిలీజ్‌. ఇది కాక రవితేజతో 'రాజా ది గ్రేట్‌', సందీప్‌ కిషన్‌తో 'కేరాఫ్‌ సూర్య', మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తో 'జవాన్‌' ఇవన్నీ మెహరీన్‌ కమింగ్‌ సూన్‌ ప్రాజెక్ట్స్‌. అతి త్వరలోనే ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదల కానున్నాయి. ఇవి కాక తమిళంలోనూ ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాను కష్టాన్ని మాత్రమే నమ్ముతాననీ, కష్టానికి తగ్గ ఫలితం దక్కిందనీ మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ. పట్టలేని సంతోషంతో సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం మీడియాలో తన అనుభవాలను పంచుకుంటోంది. ఎంట్రీ ఇచ్చింది ఒక్క సినిమానే అయినా కానీ ఎన్నో సినిమాలు చేసినట్లుగా ఆడియన్స్‌ తనను అభిమానిస్తున్నారనీ, సంబరపడిపోతోంది. ఇక గ్లామర్‌ విషయానికి వస్తే, సినిమాకి అవసరమైన గ్లామర్‌నీ ప్రదర్శిస్తాననీ, మోతాదు పెంచననీ అంటోందీ బ్యూటీ. అలాగే ఫిట్‌నెస్‌లో కూడా పాత్రకి తగ్గట్టుగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటాననీ చెబుతోంది ముద్దుగుమ్మ మెహరీన్‌.

ALSO READ: స్పైడ‌ర్‌ రివ్యూ & రేటింగ్స్