ENGLISH

నానితో హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేస్తాడట

13 June 2017-16:10 PM

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ మేర్లపాక గాంధీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాలతో సత్తా చాటాడు. చిన్న సినిమాలైనా మంచి విజయాల్ని అందుకున్నాయి ఈ సినిమాలు. డైరెక్టర్‌గా మేర్లపాక గాంధీకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఈ డైనమిక్‌ డైరెక్టర్‌ ఇప్పుడు నానితో ఓ సినిమా చేయబోతున్నాడు. నాని ఏ సినిమాకి ఓకే చెప్పినా అది హిట్టే అన్నట్టుందిప్పుడు. నానితో సినిమా చేయాలే కానీ ఖచ్చితంగా ఆ సినిమా హిట్‌ అయిపోతోంది. నానితో సినిమా మేకింగ్‌ చాలా సింపుల్‌ అండ్‌ కంఫర్టబుల్‌ కూడా. అందుకే రెండు వరుస హిట్స్‌తో దూకుడు మీదున్న దర్శకుడు కావడంతో మేర్లపాక గాంధీ - నాని కాంబినేషన్‌లో సినిమా హిట్‌ అవకుండా ఉంటుందా? అందుకే డిసైడ్‌ అయిపోయాడు. నానిని హీరోగా పెట్టి సినిమా చేయాలని. అందుకోసం ఓ జబర్డస్త్‌ స్టోరీని సిద్దం చేసి పెట్టాడట మేర్లపాక గాంధీ. వివరాలు త్వరలోనే తెలియజేస్తానంటున్నాడు. నానితో తన సక్సెస్‌ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్న మేర్లపాక గాంధీ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న 'నిన్నుకోరి' విడుదలకు సిద్ధమవుతోంది. నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. నానితో 'జెంటిల్‌మెన్‌' సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇంకో వైపున నాని 'ఎంసిఎ' అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.

ALSO READ: ప్రబాస్‌కి అతడైతేనే కరెక్ట్‌