ENGLISH

Michael Review: మైఖేల్ మూవీ రివ్యూ & రేటింగ్!

03 February 2023-18:21 PM

నటీనటులు: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్, గౌతం మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్

దర్శకుడు : రంజిత్ జయకోడి

నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు

సంగీత దర్శకులు: సామ్ సిఎస్

సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్

ఎడిటర్: ఆర్.సత్యనారాయణన్

 

 

రేటింగ్: 2.25/5

 

 

సందీప్ కిషన్ చాలా మంచి క్యాలిబర్ వున్న నటుడు. కానీ అదృష్టమే కలిసి రాలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత మళ్ళీ అంతటి విజయం సందీప్ ఖాతాలో పడలేదు. అయితే ఆయన మాత్రం ప్రయత్నం ఒడులుకోలేదు. సినిమాలు చేస్తూనే వున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా మైఖేల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేపింది. విజయ్ సేతుపతి, గౌతం మీనన్, వరుణ్ సందేశ్ .. ఇలా చాలా మంచి తారాగణం ఈ సినిమా కోసం కలిసొచ్చింది. సందీప్ మార్కెట్ ని మించి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. ఈ సినిమా విజయం సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశాడు సందీప్. మరి సందీప్ నమ్మకం నిజమైయింది ? ఇంతకీ మైఖేల్ కథ ఏమిటి ?  

 

 

కథ:

 

 

మైఖేల్‌ (సందీప్‌ కిషన్‌) చిన్నప్పుడే గ్యాంగ్ స్టర్ గురునాథ్‌ (గౌతమ్‌ మేనన్‌)ను ఓ భారీ ఎటాక్‌ నుంచి రక్షిస్తాడు. తనని కాపాడినందుకు కృతజ్ఞతగా మైఖేల్‌ను తన దగ్గరే ఉంచుకుంటాడు గురు. మైఖేల్ పెద్దయిన తర్వాత గురునాథ్ పై మరో ఎటాక్ జరుగుతుంది. తనని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తుల్లో రతన్‌ (అనీష్‌ కురువిల్లా)నుమ్ అతడి కూతురు తీర (దివ్యాంశ కౌశిక్‌)ను చంపే బాధ్యతను మైఖేల్‌ చేతిలో పెడతాడు గురు. అయితే రతన్‌ను వెతికి పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన మైఖేల్ తీరకు దగ్గరవుతాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో గురునాథ్‌ తనయుడు అమర్‌నాథ్‌ (వరుణ్‌ సందేశ్‌) అనుకోని పరిస్థతిలో చంపేస్తాడు మైఖేల్. మైఖేల్ అలా ఎందుకు చేశాడు? తన కొడుకుని చంపినమైఖేల్‌ను గురునాథ్‌ ఏం చేశాడు? అసలు మైఖేల్‌ గతం? ఈ కథలో విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ల పాత్రలేంటి? అన్నది మిగతా కథ. 

 

 

విశ్లేషణ:

 

 

ఒక గ్యాంగ్ స్టర్ కథ ఇది. కేజీఎఫ్ తరహలో తీయాలనే ఆలోచన అడుగడుగునా కనిపించింది. అచ్చు కేజీఎఫ్ లానే హీరో పాత్రని వాయిస్ తో పరిచయం చేయడం, ఎలివేషన్లు, నేపధ్య సంగీతం.. అన్నీ కేజీఎఫ్ ని గుర్తుకు తెస్తాయి. అయితే మైఖేల్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కథలో వేగం తగ్గిపోతుంది. తీర, మైఖేల్ ల ప్రేమకథ ఆసక్తికరంగా వుండదు. పైగా హీరో లక్ష్యం ఏమిటో అర్ధం కాకపోవడంతో సీన్లు అన్నీ క్లూ లెస్ గా వెళుతూవుంటాయి. ఇంటర్వెల్ బాంగ్ కూడా రొటీన్ గానే వుంటుంది. 

 

 

అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే విజయ్ సేతుపతి ఎపిసోడ్ ఫ్యాన్స్ ని నచ్చుతుంది. నిజానికి ఆ పాత్రని కూడా బలంగా డిజైన్ చేయలేదు. జైలర్ అయిన విజయ్ సేతుపతి ఇంట్లో నాటు బాంబులు ఎందుకు తయారు చేస్తుంటాడు ? చికెన్ మటన్ అంటూ తుపాకులు మార్కెట్ నుంచి ఎందుకు తెచ్చుకుంటాడు ఇవన్నీలాజిక్ క్లారిటీకి దూరంగా వుంటాయి. అయినప్పటికీ ఆయన ప్రజన్స్ బావుంటుంది. మైఖేల్ కథలో మెరుపు లేదు. దర్శకుడు తన ద్రుష్టి అంతా కేవలం మేకింగ్ మీదే పెట్టాడు. కథ ప్రేక్షకుడికి ఆసక్తిగా వుందో లేదో చేసుకోలేదు. కాసేపు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చి మళ్ళీ మామూలు గ్యాంగ్ స్టర్ డ్రామాల కథనం ను నడిపిన విధానం అంత ఆకట్టుకోదు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా వీక్. చివరిగా రివిల్ చేసిన ట్విస్ట్ ఈ కథకు ఎలాంటి బలాన్ని ఇవ్వలేకపోయింది. 

 

 

నటీనటులు :

 

 

మైఖేల్‌ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు సందీప్‌. తన లుక్‌ను మార్చుకున్న తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. మాఫియా డాన్‌గా గురునాథ్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ చక్కగా ఒదిగిపోయారు. ఆ పాత్రను చూపించిన విధానం బాగుంది.

 

 

వరుణ్‌ను విలన్ గా కొత్తగా కనిపించాడు. తీరగా దివ్యాంశ నటన ఓకే. విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ ఫ్యాన్స్ కి నచ్చేలా తీశారు. అనుసయ పాత్రని తీర్చిదిద్దిన విధానంలో కాస్త అతి కనిపించింది. మిగతా పాత్రలు పరిధి మేర వున్నాయి. 

 

 

టెక్నికల్ :

 

 

మేకింగ్ పరంగా మైఖేల్ కి మంచి మార్కుపు పడతాయి. కెమరా వింటేజ్ లుక్ లో కదిలింది. ఎడిటింగ్ లో చాలా జంప్స్ వున్నాయి.

 

 

నేపధ్య సంగీతం బలాన్ని ఇచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. దర్శకుడు రంజిత్‌ తీసుకున్న కథలో కొత్తదనం లేదు. అయితే మేకింగ్‌ స్టైల్‌ కాస్త కొత్తగా అనిపించినా.. ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగించడం మైఖేల్ వెనకబడిపోయాడు 

 

 

ప్లస్ పాయింట్స్

 

 

సందీప్ కిషన్ 

మేకింగ్ 

 

 

మైనస్ పాయింట్

 

 

కొత్తదనం లేని కథ 

బలహీనమైన కథనం 

పాత్రలలో ఎమోషన్ లేకపోవడం 

 

 

ఫైనల్ వర్డిక్ట్: మేటర్ తక్కువ.. మేకింగ్ ఎక్కువ.