ENGLISH

Modi, Chiru: చిరుకు ప్రధాని అభినందన

21 November 2022-14:07 PM

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది.

 

ఈ నేపధ్యంలో చిరంజీవి ని అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. చిరంజీవి ప్రతిభ విశేషమైనది. అతని గొప్ప పని, వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన స్వభావం ఎందరికో స్ఫూర్తి. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నందుకు ఆయనకు అభినందనలు'' అని సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు మోడీ.

ALSO READ: Pawan Kalyan: ప‌వ‌న్ ని అడిగే ధైర్యం ఉందా...?