ENGLISH

క‌ల‌క్ష‌న్ కింగ్ కి కోపం వ‌చ్చింది.. ఇక వాళ్లు ఫ‌స‌క్‌!

10 July 2021-15:34 PM

మోహ‌న్‌బాబుకి ముక్కుమీద కోపం ఉంటుంది. ఆయ‌న దేన్నీ దాచుకోరు. కోప‌మైనా... అభిమాన‌మైనా. అయితే ఇప్పుడు ఓ యూ ట్యూబ్ చాన‌ల్ పై ఆయ‌న‌కు కోపం వ‌చ్చింది. ఆ ఛాన‌ల్ వ్య‌వహారంపై మోహ‌న్ బాబు అగ్గిలంపై గుగ్గిల‌మ‌వుతున్నారు. అంతే కాదు. సైబ‌ర్ క్రైమ్ వాళ్ల‌కు సైతం ఫిర్యాదు చేశారు. పొలిటిక‌ల్ మోజో అనే ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ త‌న‌పై క‌క్ష క‌ట్టి, త‌న‌ని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తోంద‌ని, త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా.. అందులో వార్త‌లు ఉంటున్నాయ‌ని మోహ‌న్ బాబు సైబర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై త‌క్ష‌ణం ద‌ర్యాప్తు చేసి, న్యాయం చేస్తామ‌ని.. పోలీసులు మోహ‌న్ బాబుకి హామీ ఇచ్చారు.

 

ఈమ‌ధ్య సోష‌ల్ మీడియా విప‌రీతంగా పెరిగిపోవ‌డం, కేవ‌లం హిట్స్ ని టార్గెట్ చేసుకుని యూ ట్యూబ్ ఛాన‌ళ్లు రెచ్చిపోవ‌డం చూస్తూనే ఉన్నాం. అంద‌రి టార్గెట్.. సెల‌బ్రెటీలే. వాళ్ల‌ని మీమ్స్ పేరుతో వెట‌కారం చేయ‌డం మ‌రింత ఎక్కువ అవుతోంది. కొంత‌మంది వీటిని పట్టించుకోరు. కానీ.. హ‌ద్దు మీరితే మాత్రం ఏదో ర‌కంగా చెక్ పెట్టాల‌ని చూస్తుంటారు. మోహ‌న్ బాబు చేస్తోంది కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. మ‌రి ఇక‌నైనా.. ఆ ఛాన‌ల్ కాస్త త‌గ్గుతుందేమో చూడాలి.

ALSO READ: వెంకీ పంతం.. నెర‌వేరుతుందా?