ENGLISH

ఒక్క‌డు.. సీక్వెల్ వ‌స్తోందా?

03 January 2021-09:46 AM

మ‌హేష్ బాబు కెరీర్‌లో మొద‌టి మైలు రాయి... ఒక్క‌డు. ఆ సినిమాతోనే త‌ను స్టార్ అయిపోయాడు. గుణ‌శేఖ‌ర్‌ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిలువుట‌ద్దం ఆ సినిమా. ఎం.ఎస్‌రాజు నిర్మాణ విలువ‌లు, మ‌ణిశ‌ర్మ సంగీతం, క‌ళా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌... ఇవ‌న్నీ క‌లగ‌లిపి ఆ సినిమాని సూపర్ డూప‌ర్ హిట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంద‌ని టాక్‌. ఒక్క‌డు 2కి సంబంధించిన క‌థ ఎం.ఎస్‌.రాజు సిద్ధం చేశార‌ని ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హేష్ ని ఒప్పించే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది.

 

ద‌ర్టీ హ‌రీతో ఇటీవ‌ల మెగా ఫోన్‌ప‌ట్టారు.. ఎం.ఎస్‌.రాజు. ఆ సినిమాకి మంచి ఫ‌లిత‌మే వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్ల‌తో మాట్లాడారు రాజు. ఓ అభిమాని ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ... మ‌హేష్‌తో త‌ప్ప‌నిస‌రిగా, ఒక్క‌డు 2 చేస్తాన‌ని, అందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, నెల‌రోజుల్లో క్లారిటీ వ‌స్తుందని చెప్పుకొచ్చారు. ఎం.ఎస్‌.రాజుతో సినిమా చేయాల‌ని... మ‌హేష్ కూడా భావిస్తున్నాడ‌ట‌. మ‌హేష్ కి ఇదే రైట్ టైమ్ మ‌రి.

ALSO READ: పవన్‌ కళ్యాణ్‌లోని 'పవర్‌' అలాంటిది.!